Viral video: ఎవడ్రా వీడు! మరీ ఓపికకు బ్రాండ్ అంబాసిడర్‌లా ఉన్నాడేంటి?

by D.Reddy |   ( Updated:2025-03-20 15:13:36.0  )
Viral video: ఎవడ్రా వీడు! మరీ ఓపికకు బ్రాండ్ అంబాసిడర్‌లా ఉన్నాడేంటి?
X

దిశ, వెబ్ డెస్క్: ఓపికగా (patience) ఉండి, సహనం పాటిస్తే అంతా మంచే జరుగుతుందని చెబుతుంటారు పెద్దలు. కానీ, నేటితరం యువతకు అస్సలు ఓపికే ఉండటం లేదు. పైగా పనుల్నీ త్వర త్వరగా పూర్తవ్వాలి అనుకుంటారు. ఒకవేళ ఏదైనా పని ఆలస్యమైతే అంతే సంగతి.. కోపం (Angry) కట్టలు తెచ్చుకుంటుంది. ఇక అలాంటి వారికి ఓపిక ఎలా ఉంటుందో చెప్పటం కాదు, స్వయంగా చూపించే ఓ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ (Viral in social media) అవుతోంది.

సాధారణంగా చాలా మంది జంతువులను, పక్షులను పెంచుకుంటుంటారు. కొంత మంది ఇంట్లో అక్వేరియం ఏర్పాటు చేసుకుని చేపలను, తాబేళ్లను కూడా పెంచుకోవటం చూస్తుంటాం. అలాగే, ఓ వ్యక్తి తాబేలును పెంచుకుంటున్నాడు. ఇక తాబేలు.. నీటిలో, భూమిపై రెండింట్లోనూ నివసించగలదని తెలిసిందే. అంతేకాదు, తాబేలు ఎంత నెమ్మదిగా నడుస్తోందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది, ఆ వ్యక్తి కుక్క పిల్ల మాదిరిగా తాబేలుకు బెల్టు ఏర్పాటు చేసి, దాన్ని వాకింగ్ తీసుకెళ్లాడు. దీంట్లో ఏముంది.. పెంచుకున్నాడు కాబట్టి, ప్రేమగా తీసుకెళ్లాడు అందరూ చేసేదే కదా అనుకుంటున్నారేమో! అయితే, ఇక్కడే అసలు ట్వీస్ట్ ఉంది. ఏంటంటే.. తాబేలు నిదానంగా నడుస్తుంటే దాన్ని వదిలేసి ఎక్కడో ఓ చోట కూర్చుడిపోలేదు. దానితోపాటు ఆ వ్యక్తి కూడా అంతే స్లోగా నడుచుకుంటూ దాని వెనకే వెళ్లాడు. ఓపికగా తాబేలు వాకింగ్ పూర్తి చేయించి ఇంటిికి తీసుకొచ్చాడు. అయితే, వారు ఇంటి నుంచి ఉదయం వెళ్తే తిరిగి వచ్చే సరికి రాత్రి అయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఓపికకు బ్రాండ్ అంబాసిడర్‌లా ఉన్నాడంటూ కొందరు, తాబేలును వాకింగ్ తీసుకెళ్తే ఇలాగే ఉంటుంది అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

READ MORE ...

Viral video: లిఫ్ట్‌లో ఒక్కసారిగా ఊహించని ప్రమాదం.. బాలుడి ధైర్యానికి ప్రశంసలు!



Advertisement
Next Story