Viral Video: పొట్టి బట్టలతో వీధుల్లో చక్కర్లు.. క్షమాపణలు చెబుతూ మరో పోస్ట్

by Ramesh Goud |
Viral Video: పొట్టి బట్టలతో వీధుల్లో చక్కర్లు.. క్షమాపణలు చెబుతూ మరో పోస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం ఓ యువతి ఇండోర్ వీధుల్లో పొట్టి బట్టలతో తిరిగింది. వీడియో కాస్త వైరల్ మారడంతో క్షమాపణలు చెబుతూ మరో పోస్ట్ పెట్టింది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో గత కొద్ది రోజుల క్రితం ఓ యువతి అందరూ తిరిగే ప్రదేశంలో బ్రా ధరించి నడి రోడ్డుపై చక్కర్లు కొట్టింది. అంతేగాక ఫేమస్ అవ్వడం కోసం పొట్టి బట్టలతో రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ఆ యువతిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిస్సిగ్గుగా.. సంస్కారం లేకుండా అలా తిరగడమేంటని దుమ్మెత్తిపోశారు. అంతేగాక దీనిపై మధ్యప్రదేశ్ మంత్రి కైలాశ్ విజయవర్గీయా స్పందిస్తూ.. ఇండోర్ సాంస్కృతిక వారసత్వ నగరం అని, అలాంటి అసభ్యత ఇక్కడ జరగకూడదని అన్నారు.

అలాగే దీనిపై పాలనా యంత్రాంగం జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ.. అటువంటి వారిని సమాజం బహిష్కరించాలని పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ఆ అమ్మాయి అడ్రెస్ కోసం వెతుకే పనిలో పడ్డారు. ఇక దీనిపై ఆ యువతి స్పందిస్తూ మరో పోస్ట్ పెట్టింది. ఇందులో ఆమె మాట్లాడుతూ.. ఆ బట్టలు మాములుగా లేవని తాను అంగీకరిస్తున్నానని, కానీ చాలా మంది అమ్మాయిలు అలాంటి దుస్తులు ధరిస్తారని సమర్ధించుకునే ప్రయత్నం చేసింది. అలాగే ఫేమస్ అయ్యి, ట్రెండింగ్‌లో ఉండటం కోసమే ఇదంతా చేశానని చెబుతూ.. పోలీసులకు తన అడ్రస్ కూడా చెప్పింది. దీనిపై వివాదం మరింత ముదరడంతో మరో వీడియోలో తాను తప్పు చేసినట్లు అంగీకరిస్తున్నానని, ఎవరి మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశం తనకు లేదని అంటూ.. క్షమాపణలు చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed