Viral: అబ్బాయి కోసం పొట్టు పొట్టు కొట్టుకున్న ఇద్దరు యువతులు.. కలికాలం అంటూ కామెంట్స్

by Kavitha |
Viral: అబ్బాయి కోసం పొట్టు పొట్టు కొట్టుకున్న ఇద్దరు యువతులు.. కలికాలం అంటూ కామెంట్స్
X

దిశ, ఫీచర్స్: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటినుంచి చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఫన్నీ, ఇంట్రెస్టింగ్, డాన్స్ ఇలా అనేక రకాల వీడియోలు చక్కర్లు కొట్టడం మనం చూస్తూ ఉంటాం. అలాగే కొట్టుకున్న వీడియోలు కూడా చూస్తూనే ఉంటాం. కానీ అబ్బాయి కోసం అమ్మాయిలు కొట్టుకునే వీడియో చాలా రేర్. ఇప్పుడు ఆ కోవకు చెందిన వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తుంది.

బేసిక్‌గా తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించి మంచి స్థాయిలో ఉండాలని తాము కష్టపడి మరీ.. పిల్లలను పాఠశాలలకు, కళాశాలలకు పంపిస్తుంటారు. అయితే కొందరు బాగా చదువుకొని వారి తల్లిదండ్రుల కోరికలను నెరవేర్చుతారు. కానీ మరికొందరు మాత్రం చదువుకు మించి ఇతర పనులు చేసి మధ్యలో మానేసి వారికి బాధను కలిగిస్తారు.

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని ఎన్‌ఐఈటీ కాలేజీలో జరిగిన ఘటన ప్రకారం.. కళాశాలలో ఇద్దరు యువతులు ఒకే అబ్బాయితో ప్రేమలో పడ్డారు. ఆ కారణంగా ఓ యువతి తరగతి గదిలోనే తన ఫ్రెండ్స్‌తో కలిసి మరో యువతిపై దాడి చేసింది. క్లాస్‌లోనే నా వాడంటే నా వాడు అని ఆ ఇద్దరమ్మాయిలు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. అయితే ఈ ఇద్దరి మధ్య అవుతున్న గొడవను కొందరు విద్యార్థులు ఆపేందుకు ప్రయత్నిస్తుండగా.. మరికొందరు మాత్రం తమ మొబైల్‌ ఫోన్లలో ఈ తతంగాన్ని మొత్తం రికార్డు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు అమ్మాయి కోసం అబ్బాయి కొట్టుకోవడం చూసాం కానీ అబ్బాయి కోసం అమ్మాయిలు కొట్టుకోవడం ఏంటి.. దీనినే కలికాలం అంటారంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story