Trending: రన్నింగ్ ట్రైన్ నుంచి జారిపడిన యువకుడు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

by Shiva |   ( Updated:2024-07-26 07:43:16.0  )
Trending: రన్నింగ్ ట్రైన్ నుంచి జారిపడిన యువకుడు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: నిత్యం లక్షలాది మంది జనంతో ముంబైలోని పలు రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతుంటాయి. తెల్లారిందంటే చాలు చీమలు దూరే సందు కూడా లేకుండా మెట్రో, ఎంఎంటీస్ రైళ్లు కిక్కిరిసి రాకపోకలు కొనసాగిస్తాయి. సమయానికి ఆఫీసుకు చేరుకోవాలనే తొందరలో కొందరు ట్రైన్‌ ఎక్కి సర్కస్ ఫీట్లు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ముంబైలోని ఎంఎంటీఎస్ ట్రైన్‌లో తీవ్ర విషాదం చేటుచుసుకుంది. టైర్ ఫుట్‌బోర్టులో యువకులు నిలబడి ప్రయాణిస్తుండగా.. అందులో ఓ వ్యకి ఎడమ చేతిని చాచాడు. దీంతో పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం చేతికి తగలడంతో అదుపుతప్పి ఒక్కసారిగా కింద పడిపోయాడు. ప్రమాదం జరిగిన సమయంలో ట్రైన్ 90 కి.మీ వేగంతో దూసుకెళ్తుంగా యువకుడికి తీవ్రగాయలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన లైవ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

వీడియో లింక్ కోసం పక్కనే లింక్ క్లిక్ చేయండి: https://x.com/ChotaNewsTelugu/status/1816730037904658541

Advertisement

Next Story