- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Trending: నెట్టింట్లో ట్రెండ్ అవుతోన్న ‘పోల్ ట్రాకర్’ ఎగ్జిట్ పోల్.. తెలంగాణలో మెజారిటీ సీట్లు ఆ పార్టీకేనట!
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ క్రమంలోనే మెజారిటీ సీట్లు ఏ పార్టీ కైవసం చేసుకుంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో తాము అమలు చేస్తున్న గ్యారంటీలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాయని లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో డబుల్ డిజిట్ ఖాయం అంటూ అధికార కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ గెలుపుపై ధీమాతో ఉంది. రాష్ట్రంలో సాగునీటి కొరత, ఎండిన పంటలు, ప్రభుత్వ పాలనా వైఫల్యాలు, గ్రామాల్లో కరెంటు కోతలు తమకు ప్లస్ అవుతాయని ఆ పార్టీ భావిస్తోంది. తాము ఆశించిన సీట్ల కంటే ఎక్కువ స్థానాలనే కైవసం చేసుకంటామంటూ ఆ పార్టీ నాయకులు స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. ఇక బీజేపీ కూడా రెండంకెలపై కన్నేసింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది.
హిందుత్వ నినాదం, రామమందిర నిర్మాణం లాంటి కార్యక్రమాలు లోక్‌సభ ఎన్నికల్లో తమకు మంచి మైలేజ్‌ను తెచ్చిపెట్టాయని ఆ పార్టీ భావిస్తోంది. అదేవిధంగా ట్రిపుల్ తలాక్ రద్దుతో ముస్లిం మైనారిటీ మహిళల ఓట్లకు కూడా తమకు పడతాయనే ధీమాతో ఉంది. ఇక దేశ భద్రతకు సంబంధించి ఆర్టికల్ 370 రద్దు అంశం కూడా తెలంగాణలో ఎక్కువ సీట్లు వచ్చేలా దోహదపడతుందని బీజేపీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ సర్వే సంస్థ ‘పోల్ ట్రాకర్’ నిర్వహించిన సర్వే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ట్విట్టర్‌లో ఎగ్జిట్ పోల్స్ పోస్ట్ చేసిన కేవలం 15 గంటల్లోనే 17.9 లక్షల వ్యూస్‌తో నెట్టింట ట్రెండ్ అవుతోంది. అయితే, సర్వేలో అత్యధిక సీట్లను బీజేపీ కైవసం చేసుకుంటుందని తేలింది. బీజేపీకి 8 నుంచి 11 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 5 నుంచి 8 సీట్లు, ఏఐఎంఐఎంకు 1 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్ స్పష్టంగా చెబుతోంది. కానీ, ఈ సర్వేలో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని ఎగ్జిట్ పోల్‌లో బహిర్గతమైంది.