ఈ టెకీ యమా.. స్మార్ట్ గురూ! స్కూటీపై వెళుతూ.. లాప్‌టాప్‌లో క్లయింట్ కాల్ అటెండ్ (వీడియో వైరల్)

by Shiva |   ( Updated:2024-03-25 06:06:49.0  )
ఈ టెకీ యమా.. స్మార్ట్ గురూ! స్కూటీపై వెళుతూ.. లాప్‌టాప్‌లో క్లయింట్ కాల్ అటెండ్ (వీడియో వైరల్)
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ రోజుల్లో కొంతమంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఆఫీసులో తెగ పని చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తారు. పక్కోడు చేసిన పనిని కూడా తామే చేసినట్లుగా చెప్పుకుంటూ అందరీ ముందు షో చేస్తుంటారు. వారిలోనే రెండో రకం బ్యాచ్ కూడా ఒకటి ఉంటది. వాళ్లేంటంటే అందరీ సమస్యలను నెత్తినేసుకుని టీం మొత్తాన్ని లీడ్ చేస్తూ.. అప్రైజల్ పొందాలని ఆరాటపడుతుంటారు. తిన్నా.. పడుకున్నా లాప్‌టా‌పే వాళ్ల ప్రపంచం. అదిగో అచ్చం అలాంటి వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు వీడియోలో ఏముందంటే.. బెంగళూరు నగరంలో ఓ టెకీ స్కూటీ నడుపుతూ.. ముందు మొకాళ్లపై లాప్‌టాప్ పెట్టుకున్నాడు. పైగా ఓ క్లయింట్‌తో కాల్‌‌ మాట్లాడుకుంటూనే డ్రైవింగ్ చేస్తున్నాడు. అందుకు సంబంధించి వీడియోను ఓ నెటిజన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ ఫుటేజ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు.. ‘బెంగుళూరులోని ఐటీ ఉద్యోగి వారానికి 70 గంటలు పని చేసేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ‘ఈ రోజుల్లో సాధారణ మానవుడి జీవితం తీవ్ర ఒత్తిడి కూడకుంది’ అంటూ రిప్లే ఇస్తున్నారు.

వీడియో కోసం కింద లింక్ క్లిక్ చేయండి:

https://x.com/IndianTechGuide/status/1771908479672091057?t=sL7BsAh447fH594wuXvpaA&s=08

Advertisement

Next Story