శవం సాక్షిగా పెళ్లి.. కాబోయే మామ కోసం ఓకే చెప్పిన వధువు

by sudharani |
శవం సాక్షిగా పెళ్లి.. కాబోయే మామ కోసం ఓకే చెప్పిన వధువు
X

దిశ, వెబ్‌డెస్క్: తల్లిదండ్రులు పిల్లలు కోసం ఏ పని అయినా చేస్తారు. వాళ్ల సంతోషం కోసం తల్లిదండ్రులు ఏం చేయడానికైనా వెనకాడరు. అలాగే కొంత మంది పిల్లలు కూడా అదే విధంగా చేస్తారు. తనను కనిపెంచిన తల్లిదండ్రులకు ఏం చేసిన తక్కువే అని ఫీల్ అయ్యే పిల్లలు కూడా ఉంటారు. ఈ క్రమంలోనే ఓ కొడుకు తన తండ్రి కోసం చేసిన పని అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. కొడుకు పెళ్లి చూడాలని కోరికతో ఉన్న తండ్రి.. ఇంకో వారం రోజుల్లో పెళ్లి అనగా చనిపోయారు. దీంతో కొడుకు తన తండ్రి భౌతికకాయం వద్దనే పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన తమిళనాడులో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కళ్లక్కురిచ్చి సమీపంలోని పెరువంగూర్ గ్రామానికి చెందిన పంచాయతీ అధ్యక్షురాలు అయ్యమ్మాళ్ భర్త రాజేంద్రన్ భార్యాభర్తలు. వీరి కుమారుడు ప్రవీణ్‌కు వివాహం నిశ్చమయింది. పెళ్లి ఈ నెల 27 న జరగాల్సి ఉండగా.. వివాహానికి అన్నీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొడుకు పెళ్లి చూడాలని తండ్రికి కోరిక. ఎంతో ఆనందంగా పెళ్లి పనులు జరుగుతున్న క్రమంలో సడెన్‌గా ఆ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

కొడుకు పెళ్లి వారం రోజులు ఉంది అనగా తండ్రిని మృత్యవు ఆవహించింది. అయితే తన పెళ్లి చూడాలన్న తండ్రి కోరిక ఎలాగైనా తీర్చాలి అనుకున్నాడు కొడుకు. అతడికి నిశ్చితార్థం అయిన యువతి తన తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యింది. ఈ క్రమంలోనే ఆ యువతిని, ఆమె కుటుంబసభ్యులను ఒప్పించి తన తండ్రి భౌతికకాయం వద్దనే యువతి మెడలో తాళి కట్టాడు. కాగా.. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Advertisement

Next Story