మాల్‌లో మహిళల పట్ల వ్యక్తి అసభ్య ప్రవర్తన (వీడియో)

by GSrikanth |
మాల్‌లో మహిళల పట్ల వ్యక్తి అసభ్య ప్రవర్తన (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: బెంగళూరులోని ఓ మాల్‌లో మహిళను లక్ష్యంగా చేసుకొని ఓ వ్యక్తి అసంభ్యంగా ప్రవర్తించాడు. ఆ మాల్‌లోని మహిళలను కావాలనే తాకుతూ కెమెరాల కంటికి చిక్కాడు. దీంతో ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో తాజాగా వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని లులూ మాల్ వద్ద గేమ్ జోన్ ఏరియాలో 45 ఏళ్ల వ్యక్తి రద్దీగా ఉన్న చోటుకి వెళ్లి మహిళలు, బాలికలపై అసభ్యకరంగా టచ్ చేస్తూ కనిపించాడు.

దీంతో అక్కడే ఉన్న మరో వ్యక్తి అతనిని గమనించి.. అతని కదలికలను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తర్వాత వీడియో తీసిన వ్యక్తి అక్కడి సెక్యూరిటీ కి వెళ్లి చెప్పాడు. తర్వాత ఆ వ్యక్తి కోసం సెక్యూరిటీ సిబ్బంది వెతికారు. కాగా, ఈ వీడియో వైరల్ అవ్వడంతో.. పలువురు నెటిజన్లు బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు వీడియో ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story