- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీసులకు స్టూడెంట్ సూటి ప్రశ్న.. దద్దరిల్లిన ఆడిటోరియం (వీడియో వైరల్)
దిశ, డైనమిక్ బ్యూరో: డ్రగ్స్ పై పోలీసులకు సూటి ప్రశ్న వేసిన విద్యార్ధి వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్ గా మారింది. హర్యానాలోని సోనిపట్ లో పోలీసులు డ్రగ్స్ పై నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో ఓ విద్యార్ధి పోలీసులకు సూటి ప్రశ్న అడిగాడు. డ్రగ్స్ కు దూరంగా ఉండాలని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో నాలుగు యూనివర్సీటీల విద్యార్ధులు పాల్గొన్నారు. ప్రస్తుత సమాజంలో చాక్లెట్లు కొన్నంత ఈజీగా మత్తు పదార్ధాలు దొరుకుతున్నాయని, ఫస్ట్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ డ్రగ్స్ డీలర్ల గురించి తెలుసుకుంటున్నారు. మరి పోలీసులకు ఎందుకు తెలియట్లేదు అని ప్రశ్నించాడు. అలాగే పోలీస్ స్టేషన్ల పరిధిలోనే డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయని, వీటిని ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారని సూటిగా అడిగాడు. దీంతో ఒక్కసారిగా విద్యార్ధుల అరుపులతో ఆడిటోరియం దద్దరిల్లి పోయింది. ఈ విషయంలో పోలీసులు వెనడగు వేస్తున్నారా? చెప్పాలన్న విద్యార్ధి ప్రశ్నలకు ఆ ఉన్నతాధికారి సరిగ్గా సమాధానం ఇవ్వలేకపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతొంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు.
డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయో ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు తెలిసినపుడు పోలీసులకు ఎందుకు తెలియదు
— Telugu Scribe (@TeluguScribe) March 8, 2024
డ్రగ్స్‌పై పోలీసులకు విద్యార్థి సూటి ప్రశ్న
హర్యానా - సోనిపట్‌లో పోలీసులు డ్రగ్స్‌పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఓ విద్యార్థి పోలీసులకు సూటి ప్రశ్న అడిగాడు.
విశ్వవిద్యాలయాలే డ్రగ్స్… pic.twitter.com/AEWtaQZAao