RRB JE-2024: నిరుద్యోగులకు బంపర్ న్యూస్.. 7,951 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

by Shiva |   ( Updated:2024-08-04 06:06:44.0  )
RRB JE-2024: నిరుద్యోగులకు బంపర్ న్యూస్.. 7,951 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు బంపర్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు 7,951 జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు అన్ని రకాల అర్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని ఆర్ఆర్‌బీ అధికారులు వెల్లడించారు. మరిన్ని వివరాలకు rrbald.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు. అయితే, దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 29తో ముగినుంది. కరెక్షన్ రుసుము చెల్లించి దరఖాస్తు ఫారంలో దిద్దుబాట్ల కోసం మాడిఫికేషన్ విండో సెప్టెంబర్ 8తో ముగియనుంది.

కెమికల్ సూపర్‌వైజర్, రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూప‌ర్‌వైజర్, రీసెర్చ్ పోస్టులు, 17 పోస్టులు, జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులు 7,934 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అన్ని పోస్టులకు వయో పరిమితి 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానం ఉండనుంది. పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సీబీటీలో ప్రతి తప్పు సమాధానానికి కేటాయించిన మార్కులో 1/3 వంతున నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. మొదటి దశ సీబీటీకి హాజరైన అనంతరం బ్యాంకు ఛార్జీలు మినహాయించి రూ.400 తిరిగి చెల్లిస్తారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డులు లేదా యూపీఐ ద్వారా మాత్రమే ఆన్లైన్ ఫీజు చెల్లించే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed