Viral video: ఈ చిన్నోడి సమయస్పూర్తికి నెటిజన్లు ఫిదా

by D.Reddy |   ( Updated:2025-03-16 13:11:37.0  )
Viral video: ఈ చిన్నోడి సమయస్పూర్తికి నెటిజన్లు ఫిదా
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ఎవరైనా కంగారుపడిపోతారు. ఏం చేయాలో ఒక్కసారిగా అర్థంకాక అయోమయంలో ఉండిపోతారు. ఇక చిన్నపిల్లల (Kids) గురించి అయితే చెప్పనక్కర్లేదు. అసలు వాళ్లకి ఏం జరుగుతుంది? ఏం చేయాలో కూడా తెలియదు. కానీ, ఓ పిల్లోడు మాత్రం ప్రమాదం ఎదురైనప్పుడు సమయస్పూర్తితో వ్యవహరించాడు. ఎలాంటి భయంలేకుండా తనతో పాటు తన చెల్లి ప్రాణాలను కూడా కాపాడాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా (Viral) మారింది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే?

ఓ ఇంట్లోని బెడ్ రూంలో బెడ్‌పై మంత్స్ బేబీని పడుకుని ఉంటుంది. పక్కనే సుమారు నాలుగైదు ఏళ్లు ఉన్న ఆ బేబీ అన్నయ్య ఆడుకుంటూ ఉన్నాడు. ఇంతలో పక్కనే వాడ్‌డ్రాప్ దగ్గర్లోని సాకెట్ నుంచి మంటలు (Fire) వ్యాపించాయి. క్షణాల్లో అవి అంటుకోవటం ప్రారంభించాయి. ఇది చూసిన ఆ బాలుడు భయపడకుండా వెంటనే అలర్ట్ అయ్యాడు. సమయస్పూర్తితో ప్రవర్తించాడు. రూం నుంచి బయటి వెళ్లి ఫైర్ సేఫ్టీ సిలిండర్ తీసుకువచ్చి మంటలను ఆర్పేశాడు. అనంతరం స్విచ్చేస్ అన్ని ఆఫ్ చేసి, తనతో పాటు తన చెల్లి ప్రాణాలను కూడా రక్షించుకున్నాడు. రూంలోకి సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డు అవ్వగా ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social media) వైరల్‌గా మారాయి. వీడియో చూసిన నెటిజన్లు బాలుడి సమయస్పూర్తిని, ధైర్యాన్ని మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.



Next Story

Most Viewed