మోనాలిసాకు కలిసొచ్చిన మరో అదృష్టం.. అది ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

by Jakkula Mamatha |   ( Updated:2025-02-17 06:43:17.0  )
మోనాలిసాకు కలిసొచ్చిన మరో అదృష్టం.. అది ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
X

దిశ,వెబ్‌డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh) ప్రయాగ్‌రాజ్‌(Prayag Raj)లో జరుగుతున్న మహా కుంభమేళా(Mahakumbh Mela)లో తేనెకళ్లతో అందరి దృష్టిని ఆకర్షించిన మోనాలిసా ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మోనాలిసా మహాకుంభమేళాలో రుద్రాక్షలు, పూసల దండలు అమ్ముకునేందుకు వచ్చింది. ఈ క్రమంలో ఆమెను చూసిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు.. ఆమె ఫొటోలు, వీడియోలు తీసి పోస్ట్ చేశారు. దీంతో ఆమె ఒక్కసారిగా వైరల్‌ కావడం.. ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగిన మోనాలిసాను చూడటానికి జనం ఎగబడ్డారు.

ఈ నేపథ్యంలో ఆమెకు బాలీవుడ్ డైరెక్టర్(Bollywood Director) సనోజ్ మిశ్రా(Sanoj Mishra) సినిమా ఆఫర్ కూడా ఇచ్చారు. ఆమె త్వరలోనే మూవీ షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మధ్య మోనాలిసా(Monalisa)కు సంబంధించి ఏ వార్త అయిన ఇట్టే వైరల్‌గా మారుతోంది. ఈ తరుణంలో మహాకుంభమేళాతో దేశవ్యాప్తంగా వైరలైన లక్కీ గర్ల్ మోనాలిసాకు మరో ఖ్యాతి దక్కింది. ఈ నెల(ఫిబ్రవరి) 26వ తేదీన నేపాల్‌(Nepal)లో జరిగే శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాలని కుంభమేళా బ్యూటీ మోనాలిసాకు ఆహ్వానం అందింది.

ఈ తేనె కళ్ల సుందరితో సినిమా సినిమా చేస్తున్న సనోజ్ మిశ్రా, ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ కూడా ఈ వేడుకలకు హాజరు కానున్నారు. ఇటీవల ఆమె కేరళ(Kerala)లో ఓ జువేలరీ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వెళ్లగా అభిమానులు బ్రహ్మరథం పట్టిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా ఒకరి జీవితాన్ని ఎలా మార్చిందో చూడండంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళాలో పవిత్ర స్నానాలు చేసిన వారి దశ దిశ ఏం మార్చిందో గాని.. ఆ కుంభమేళాలో పూసలమ్ముకునేందుకు వచ్చిన లక్కీ గర్ల్ మోనాలిసా జీవితాన్ని మాత్రం మార్చేసిందంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.



Next Story

Most Viewed