Festival leave:రాఖీ పండుగకు లీవ్ అడిగితే ఏకంగా ఉద్యోగమే ఊడింది.. మహిళా ఉద్యోగి ఆవేదన

by Jakkula Mamatha |
Festival leave:రాఖీ పండుగకు లీవ్ అడిగితే ఏకంగా ఉద్యోగమే ఊడింది.. మహిళా ఉద్యోగి ఆవేదన
X

దిశ,వెబ్‌డెస్క్:ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు బిజీ లైఫ్‌ను అనుభవిస్తున్నారనే చెప్పవచ్చు. ఇక ఉద్యోగాలు చేసేవారు అయితే తమకు ఎప్పుడు ఫ్రీ టైం దొరికిన ఫ్యామిలీతో సరదాగా గడుపుదామనే చూస్తారు. ఇలాంటి సమయంలో పండుగలు వస్తే ఇక ఆ ఉద్యోగులకు ఎంతో సంతోషంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. అయితే కొన్ని ఉద్యోగాలకు పండుగలకు సెలవులు ఉండకపోవచ్చు. ఇలాంటి టైంలో ఉద్యోగులు లీవ్ తీసుకోవాలని అనుకుంటారు. ఐతే తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే..అన్న చెల్లెళ్ల, అక్క తమ్ముళ్ల ప్రేమానుబంధాలకు ప్రతీక అయిన రాఖీ పండుగకు లీవ్ తీసుకుని సోదరసోదరీమణులతో ఎంతో ఆనందంగా గడపాలని చాలా మంది అనుకుంటారు. తాజాగా ఓ మహిళ ఈ విధంగానే ఆలోచించి తన ఆఫీస్‌లో రాఖీ పండగకు లీవ్ అడిగింది. వీలైతే లీవ్ ఇవ్వాలి.. లేదా కుదరదని చెప్పాలి.. కానీ ఓ కంపెనీ ఏకంగా ఉద్యోగంలో నుంచే తీసేసింది. ఇరవై రోజులు టైమిచ్చి ఆపై కంపెనీకి రావాల్సిన అవసరం లేదని టెర్మినేషన్ లెటర్ పంపింది. ఈ ఉదంతాన్ని బాధిత హెచ్చార్ ఉద్యోగిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు ఆ కంపెనీ పై మండి పడుతున్నారు.

పంజాబ్ లోని మొహాలీలో ఓ కంపెనీలో ఓ మహిళ HR మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల కంపెనీ జారీ చేసిన ఇంటర్నల్ సర్క్యులర్ వివాదాస్పదంగా మారింది. వరుస సెలవులు రావడంతో సోమవారం (ఆగస్టు 19న) రక్షాబంధన్ అయినా తప్పనిసరిగా ఆఫీసుకు రావాల్సిందేనని మేనేజ్మెంట్ ఆర్డర్ వేసింది. లేదంటే ఏడు రోజుల జీతాన్ని కట్ చేస్తామని మేనేజ్మెంట్ ఉద్యోగులను హెచ్చరించింది. దీనిపై హెచ్చార్ మేనేజర్ అభ్యంతరం చెప్పింది. ఒక్క రోజు సెలవుకు వారం రోజుల జీతం కట్ చేయడం అన్యాయమని, దీనికి తాను అంగీకరించం అని వాదనలకు దిగింది. అయితే, ఈ వాదన బెడిసికొట్టి ఆమె ఉద్యోగానికి ఎసరు పెట్టింది. ఆ మహిళను వెంటనే ఉద్యోగంలో నుంచి తొలగిస్తున్నట్లు ఆమె బాస్ టెర్మినేషన్ లెటర్ పంపాడు. తోటి ఉద్యోగుల కోసం ఫైట్ చేస్తే తన ఉద్యోగమే ఊడిందంటూ ఆ మహిళా ఈ ఉదంతాన్ని లింక్డ్ ఇన్‌లో పోస్టు చేయగా అది ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

స్పందించిన కంపెనీ యాజమాన్యం..

ఈ ఘటనపై ఆ కంపెనీ స్పందిస్తూ..ఆ మహిళ ఆఫీసులో ఫోన్ ఎక్కువగా వాడడం, వర్క్ టైం లో ఆన్ లైన్ కోర్సులు చేయడం, ఆఫీసు పని పక్కన పెట్టి కూతురు హోం వర్క్ చేస్తూ కూర్చోవడం.. ఇలాంటి పనులు చేస్తున్నందుకు చాలాసార్లు మందలించినట్లు కంపెనీ పేర్కొంది. తన విధులు పక్కన పెట్టి ఉద్యోగులతో కలిసి కుట్రలు పన్నుతోందని ఆరోపించింది. ఆగస్టు 15 నుంచి 20 వరకు లాంగ్ పెయిడ్ లీవ్ లు పెట్టాలంటూ ఉద్యోగులను రెచ్చగొడుతోందని, దీనిని అడ్డుకోవడానికే సర్క్యులర్ పంపాల్సి వచ్చిందని వివరించింది.

Next Story

Most Viewed