- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Iguanas : 1.20 లక్షల బల్లులను చంపేయనున్న ప్రభుత్వం

దిశ, వెబ్ డెస్క్ : లక్షకు పైగా బల్లులను(Lizards) చంపేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అదేంటి..! బల్లులు ఏం చేశాయి? ఆ చిన్న ప్రాణులను నిర్మూలించడం(Eradication) ఎందుకు? ఒకేసారి అంత పెద్ద సంఖ్యలో చంపాల్సిన అవసరం ఏంటా అనుకుంటున్నారా? అయితే ముందు వాటి గురించి తెలుసుకుందాం. బల్లుల జాతికి చెందిన ఆకుపచ్చ ఇగ్వానాలు(Iguanas) సరీసృపాలకు(Reptiles) చెందినవి. ఇవి పెద్దసైజు బల్లులు, తొండల్లా ఉంటాయి. ఇవి పూర్తిగా శాఖాహార జీవులు. పంటపొలాలు, పండ్ల తోటలు, పువ్వుల తోటల మీద పడి వాటిని తింటూ ఉంటాయి. పరిమాణం పెద్దగా ఉండటం వలన వీటి ఆకలికి అంతూ పంతూ అనేది ఉండదు. ఇవి కనబడిన ప్రతి మొక్కను, కాయలను, పువ్వులను తినేయడం ప్రస్తుతం ప్రభుత్వానికి తలనొప్పిగా తయారైంది. వీటి జనాభా అధికంగా ఉండటంతో వీటి బెడద ఎలా తొలగించుకోవాలో తెలియక, చివరికి చంపేయడమే ఉత్తమం అనే నిర్ణయానికి వచ్చారు అధికారులు. మరికొద్ది రోజుల్లోనే దేశంలోని 1.20 లక్షల ఇగ్వానాలను నిర్మూలించేందుకు ప్రభుత్వం పథకం సిద్ధం చేస్తోంది.
అయితే ఈ వ్యవహారం మన దేశంలో కాదండోయ్.. తైవాన్(Taiwan) దేశంలో. తమ దేశంలోని చట్టాల ప్రకారమే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని వివరణ ఇచ్చారు సంబంధిత అధికారులు. అయితే తైవాన్ తీసుకుంటున్న ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవడమే కాదు, అనేక దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. పలు ఎన్జీవోస్ నిరసనలు కూడా సిద్ధం అవుతున్నాయి.