Currency Notes: పంట పొలాల్లో రూ.500 నోట్ల కట్టలు.. అసలు విషయం ఇదే!

by Shiva |   ( Updated:2025-02-25 13:10:09.0  )
Currency Notes: పంట పొలాల్లో రూ.500 నోట్ల కట్టలు.. అసలు విషయం ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: రాత్రికి రాత్రే కోటిశ్వరులం అయిపోవాలని ఎంతోమంది కలలుకంటుంటారు. ఒక్కోసారి మనకు అకస్మాత్తుగా రోడ్లపై నోట్ల కట్టలు దొరికినట్లుగా పిచ్చి కలలు వస్తుంటాయి. కానీ, సీన్ కట్ చేస్తే.. అచ్చం అలాంటి ఘటనలో నల్లగొండ (Nalgonda) జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దామచర్ల (Damacharla) మండల పరిధిలోని బొత్తలపాలెం (Bothalapalem) గ్రామానికి చెందిన ఓ రైతు రోజు మాదిరిగానే తన పొలానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే అతడికి మార్గమధ్యలో రూ.20 లక్షల విలువైన రూ.500 నోట్లు కనిపించాయి. అవి నిజమేనా నమ్మిన సదరు రైతు పక్కవారికి చూపించాడు.

కానీ, ఆ నోట్లపై చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Children's Bank of India) అని ముద్రించి ఉండటంతో అవి దొంగ నోట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రూ.500 నోట్ల కట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పక్కా దొంగనోట్లు ముద్రించే వారి పని అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు నోట్లు మద్రించిన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు.



Next Story