Viral Video: క్రాలింగ్ పోటీ మధ్యలో హాయిగా నిద్రిస్తోన్న బుడ్డోడు.. వీడియో చూస్తే కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే

by Anjali |   ( Updated:2024-08-19 12:20:32.0  )
Viral Video: క్రాలింగ్ పోటీ మధ్యలో హాయిగా నిద్రిస్తోన్న బుడ్డోడు.. వీడియో చూస్తే కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే
X

దిశ, ఫీచర్స్: అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే పలు వీడియోలు చూస్తే తీవ్ర ఆగ్రహానికి గురవుతుంటాం. కానీ కొన్ని వీడియోలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకునేలా చేస్తాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే చిన్నపిల్లల మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. అన్నం తినిపిస్తుండగానే పడుకోవడం, ఆడుతూ ఆడుతూ నిద్రించడం, ఏవైనా దెబ్బలు తాకించుకుని పక్క వాళ్లను కొట్టడం.. ఇలా చిన్న పిల్లలు చేసే ప్రతి పని ఎదుటివారికి చాలా ముద్దొస్తుంటాయి.ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఓ పిల్లాడి చేసిన పని చూస్తే నిజంగా కడుపుబ్బా నవ్వుకుంటారు.

ఈ వీడియో చూసినట్లైతే.. థాయ్ లాండ్ కు చెందిన ఓ పిల్లాడు క్రాల్ పోటిలో పాల్గొన్నాడు. కొంచెం సేపు అయితే గేమ్ కంప్లీట్ అవుద్ది అనే సమయానికి బుడ్డోడు హాయిగా నిద్రపోతున్నాడు. పిల్లాడు నిద్రించడంతో క్రౌన్ పోటీని మధ్యలోనే ఆపి, బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో ముంచెత్తుతున్నారు. హ్యాపీ స్లీప్ రా బుడ్డోడా? వెరీ గుడ్, సో క్యూట్ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story