- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'మా కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చకు'.. Zomato కి సీరియస్ వార్నింగ్
దిశ, వెబ్ డెస్క్: ఫుడ్ డెలివరీ యాప్ Zomato ప్రమోషన్స్ లో క్రియేటివిటీని జోడించింది. అయితే ఇది ఫస్ట్ టైమ్ కాదు. వారి సర్వీసులు ప్రారంభించినప్పటి నుండి కస్టమర్లను ఎట్రాక్ట్ చేసేందుకు వినూత్న ప్రయోగాలు చేస్తూనే ఉంది. ట్రెండ్ కి తగ్గట్టు ఇన్నోవేటివ్ గా తమ ప్రమోషన్స్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో జొమాటో మరో ముందడుగు వేసింది. కొన్నిరోజులుగా కస్టమర్లకు ఫన్నీ కోట్స్ తో ఫుడ్ ఆర్డర్ పెట్టమంటూ రిక్వెస్ట్ నోటిఫికేషన్స్ పంపుతోంది. ఈ తరహాలోనే పంపిన నోటిఫికేషన్ కు కస్టమర్ రియాక్ట్ అయ్యారు. "మీ కష్టం చూడలేకపోతున్నాం.. కనీసం డిన్నర్ కి అయినా మమ్మల్ని హెల్ప్ చేయనివ్వండి.. ఆర్డర్ పెట్టడానికి ట్యాప్ చేయండి అంటూ నోటిఫికేషన్ పంపింది జొమాటో.
ఇక దీనిపై స్పందించిన కస్టమర్ ట్విట్టర్ వేదికగా ఆ స్క్రీన్ షాట్ షేర్ చేసి... జంధ్యాల స్టైల్లో విరుచుకుపడ్డారు. ఒరే నీకు ఇదే చివరాఖరి వార్నింగు, మా కుటుంబ వ్యవహారాల్లోకి మరోసారి తలదూర్చావా, ఎర్రటి ఎండలో నల్లటి కంబళీ వేసి మవుంట్ రోడ్డులో కూర్చోబెట్టేస్తాను, ఏమనుకున్నావో నా గురించి, ప్రీ వెడ్డింగు షూట్లో పిండ ప్రదానం చేసే మొహమూ నువ్వూనూ... అంటూ జంధ్యాల స్టైల్ తిట్ల దండకం అందుకున్నారు. సరదాగా ఆయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి నవ్వుల పువ్వులు పూయిస్తోంది.