ట్రెండింగ్.. మాస్కులు ఇలా కూడా వాడుతున్నారా..

by Sridhar Babu |
ట్రెండింగ్.. మాస్కులు ఇలా కూడా వాడుతున్నారా..
X

దిశ, షాద్ నగర్ : కరోనా వైరస్ నుంచి తమను రక్షించుకునేందుకు ప్రజలు భౌతికదూరంతో పాటు విధిగా శానిటైజర్, మాస్క్ లను వినియోగిస్తున్నారు. కొంతమంది ద్విచక్ర వాహనదారులు మాస్కులను కరోనా నుంచి తమను రక్షించుకోవడానికి వాడటంతో పాటుగా తమ ద్విచక్రవాహనాన్ని ట్రాఫిక్ చలాన్ల నుంచి రక్షించడానికి కూడా ఉపయోగిస్తూ తమ చతురతను ప్రదర్శిస్తున్నారు.

ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా.. చలాన్ల నుంచి తప్పించుకోడానికి ఓ వ్యక్తి బైక్ నెంబర్ కనిపించకుండా మాస్క్ అడ్డుపెట్టుకున్నాడు. ఈ ఫోటో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని కేశంపేట రోడ్డు రైల్వే గేటు వద్ద కంటపడింది. కానీ, ఇది ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్దం. ఇలా చేసి పోలీసుల కంటపడితే డబుల్ చలానాలు కట్టాల్సి వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.



Next Story

Most Viewed