టీఎస్‌ బీపాస్‌తో పారదర్శకతకు ప్రాధాన్యం

by Shyam |
టీఎస్‌ బీపాస్‌తో పారదర్శకతకు ప్రాధాన్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో : భవన నిర్మాణం, అప్లికేషన్ ప్రాసెసింగ్ సమయంలో పారదర్శకతకు టీఎస్ బీపాస్ అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు రాష్ట్ర పభుత్వం శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. టౌన్ ప్లానింగ్ అధికారులకు ఇప్పటివరకు ఉన్న విచక్షణ అధికారాలను తగ్గించడంతో భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియకు టీఎస్ బీపాస్ సహాయపడుతోందని అందులో తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ‘పైలట్ బేస్డ్ టెస్టింగ్‘ కింద ప్రస్తుతం అమల్లో ఉన్నట్టు వివరించింది.

టీఎస్‌ బీపాస్‌కు రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యికి పైగా దరఖాస్తులు రాగా.. అందులో ఎక్కువగా ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, కామారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ నుంచి వచ్చాయి. ఆరొందల గజాలకు పైబడిన నివాస, నివాసేతర నిర్మాణాలకు సంబంధించి లేఅవుట్లకు 21 రోజుల్లోపు సింగిల్ విండో ద్వారా అనుమతులు లభించనున్నాయి. ఆ తర్వాత డ్రీమ్డ్ అప్రూవల్ ప్రొసీడింగ్స్ జనరేట్ అవుతుంది. మొబైల్ యాప్, వెబ్‌సైట్, మీసేవా కేంద్రాలు, మున్సిపాలిటీల్లోని పౌర సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.

Advertisement

Next Story