తెలంగాణలో 20 మంది డీఎస్పీల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ

by Anukaran |   ( Updated:2021-09-29 22:18:40.0  )
DGP Mahender Reddy
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ వ్యాప్తంగా భారీగా సబ్ డివిజనల్ పోలీస్ అధికారుల బదిలీలు జరిగాయి. 20 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటలీజెన్స్‌లో పనిచేస్తోన్న డి.రఘుచందర్‌ను స్టేషన్ ఘన్ పూర్‌కు, స్టేషన్‌ ఘన్‌పూర్‌లో పనిచేస్తోన్న సదయ్యను మహబూబాబాద్‌కు, ఏసీబీలో పనిచేస్తోన్న వంగ రవిందర్ రెడ్డిని మెట్‌పల్లికి, మెట్‌పల్లిలో పనిచేస్తోన్న గౌస్ బాబాను చీఫ్ ఆఫీసుకు, ఇంటలీజెన్స్‌లో పని చేస్తోన్న ఎస్.గిరిప్రసాద్‌ను గోదావరిఖనికి, గోదావరిఖనిలో పనిచేస్తోన్న ఉమేందర్‌ను చీఫ్ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

అంతేగాకుండా.. ఇంటలీజెన్స్‌లో పనిచేస్తోన్న బస్వారెడ్డిని ఖమ్మం రూరల్‌కు, ఇక్కడ పని చేస్తోన్న వెంకటరెడ్డిని చీఫ్ ఆఫీసుకు, వెయిటింగ్‌లో ఉన్న బీవీ సత్యనారాయణను వికారాబాద్‌కు, వికారాబాద్‌లో పనిచేస్తోన్న ఏ.సంజీవరావును చీఫ్ ఆఫీసుకు, వెయిటింగ్‌లో ఉన్న జి.కృష్ణను జనగామకు, జనగామలో పని చేస్తోన్న ఎస్.వినోద్ కుమార్‌ను చీఫ్ ఆఫీస్‌కు, వెయిటింగ్‌లో ఉన్న ఏ.మహేష్‌ను బెల్లంపల్లికి, బెల్లంపల్లిలో పనిచేస్తోన్న రహమాన్‌ను చీఫ్ ఆఫీసుకు, వెయిటింగ్‌లో ఉన్న బి. కిషన్‌ను మహబూబ్ నగర్‌కు, మహబూబ్‌నగర్‌లో పని పనిచేస్తోన్న శ్రీధర్‌ను చీఫ్ ఆఫీసుకు, వరంగల్ పీటీసీలో పని చేస్తోన్న ఎన్.సుధీర్‌ను హైదరాబాద్‌లోని గోపాలపురానికి, గోపాలపురంలో పనిచేస్తోన్న పి.వెంకటరమణను చీఫ్ ఆఫీసుకు, వెయిటింగ్‌లో ఉన్న జి.గంగాధర్‌ను సైబరాబాద్‌లోని రాజేంద్రనగర్‌కు, రాజేంద్రనగర్‌లో పనిచేస్తోన్న ఆర్.సంజయ్ కుమార్‌ను చీఫ్ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

transfers of 20 dsps in the telangana

Advertisement

Next Story

Most Viewed