- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆ ప్రమాదం దురదృష్టకరం: ప్రభాకర్ రావు
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదం చాలా దురదృష్టకరమని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఏడుగురు ఇంజినీర్లు, ఇద్దరు వ్యక్తులు చనిపోవడం బాధాకరమన్నారు. ప్రాజెక్టులో పవర్ పోవడంతో లోపలంతా అంధకారం అయిందని ఆయన గుర్తు చేశారు.
పవర్ లేక వెంటిలేషన్ కూడా పూర్తిగా ఆగిపోయిందన్నారు. దీంతో ఎమర్జెన్సీ కూడా తెరుచుకోలేదని ఆయన వివరణ ఇచ్చారు. ఆటోమేటిక్ ట్రిప్ ఎందుకు కాలేదనే దానిపై కమిటీ వేశామన్నారు. ఇలాంటి సమస్య ఎందుకు తలెత్తిందో తెలుసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టామని చెప్పారు. అలాగే మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని ప్రభాకర్ రావు భరోసా ఇచ్చారు.
Next Story