కరీంనగర్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎందుకంటే..?

by Sridhar Babu |
కరీంనగర్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎందుకంటే..?
X

దిశ, కరీంనగర్ సిటీ: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు నేపథ్యంలో మంగళవారం నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ సీఐ నాగార్జున రావు తెలిపారు. పలు రూట్లలో వాహనాలను దారి మళ్లించనున్నట్లు పేర్కొన్నారు. జగిత్యాల వైపు నుంచి నగరానికి వచ్చే వాహనాలు రేకుర్తి, శాతవాహన వర్సిటీ, చింతకుంట, పద్మనగర్, గీతభవన్ మీదుగా బస్ స్టాండ్‌కు చేరుకోవాలని సూచించారు. జగిత్యాల వైపు వెళ్లే వాహనదారులు కూడా ఇదే మార్గంలో వెళ్లాలని, అవసరమైతే ఇతర ప్రాంతాల్లో కూడా సందర్భాన్ని పాటిస్తూ ఆంక్షలు విధించనున్నట్లు వెల్లడించారు. వాహనదారులు గమనించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.



Next Story

Most Viewed