- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాటారం వాసులకు అలర్ట్.. అలాచేస్తే భారీ ఫైన్ తప్పదు
దిశ, కాటారం : పౌరులు ఇంటి నుంచి బయటికి వెళ్లినప్పుడు ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేస్తే ఇకపై జేబులు ఖాళీ అవుతాయి. కరోనా నిబంధనలతో పాటు ట్రాఫిక్ నిబంధనలను తప్పకుండా అమలు చేయాలంటూ ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు తనిఖీలు చేయడంతో భారీ జరిమానా విధించేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు. మాస్కు ధరించకుండా ప్రజలు బహిరంగ ప్రదేశాలలో పర్యటించినా రోడ్లపై వెళ్లినా, వాహనాలలో ప్రయాణించినా వెయ్యి రూపాయలు జరిమానా విధించినట్లు, ఆదివారం నుంచి ఇది అమలులోకి తీసుకొచ్చేందుకు కాటారం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు ప్రచారం చేపట్టారు.
ట్రాఫిక్ నిబంధనలు షురూ..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రవాణా చట్టం ప్రకారం డిసెంబర్ ఐదో తేదీ నుంచి అమలులోకి వస్తుండడంతో నెంబర్ ప్లేట్ లేని వాహనాలు, ధ్రువ పత్రాలు లేని వాహనాలకు, బీమా సౌకర్యం ,డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.
అప్రమత్తతే అన్నింటికీ రక్ష.. శ్రీనివాస్ ఎస్ఐ కాటారం
కరోనా ముప్పును తప్పించుకునేందుకు, ప్రబలకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, లేకుంటే 1000 రూపాయలు జరిమానా విధించినట్లు కాటారం ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. శనివారం మండల కేంద్రమైన కాటారం లోని అంబేద్కర్ కూడలిలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని, డ్రైవింగ్ లైసెన్స్, బీమా పత్రాలు, పొల్యూషన్ సర్టిఫికెట్ తప్పకుండా ఉండాలని లేనిచో జరిమానా విధించినట్లు వివరించారు. ప్రజలు కరోనా ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని, అప్రమత్తతే అందరికీ రక్షణగా ఉంటుందని శ్రీనివాస్ తెలిపారు.