- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
హెల్మెట్ పెట్టుకోలేదని పోలీసులపై మరో ట్రాఫిక్ పోలీస్ దాడి..

దిశ, వెబ్ డెస్క్ : రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు, పోలీసులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని హెచ్చరిస్తున్నారు. హెల్మెట్ లేని పక్షంలో జరిమానాలు కూడా విధిస్తున్నారు. అయితే.. జార్ఖండ్‌లో ఓ పోలీసు బైక్‌పై వెళుతూ హెల్మెట్ పెట్టుకోలేదనే కారణంగా సదరు పోలీసుతో ట్రాఫిక్ పోలీస్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకి మాటా మాటా పెరిగి దాడి చేసుకున్నారు.
వివరాల ప్రకారం.. రాంచీలోని సహజానంద్చౌక్ సమీపంలో ఓ పోలీస్ హెల్మెట్ లేకుండా బైక్‌పై వెళ్తున్నారు. ఇది గమనించిన అక్కడి ట్రాఫిక్ పోలీస్.. ఆయన వాహనానికి ఫైన్ వేశారు. కానీ, సదురు పోలీసు అధికారి.. ఫైన్ వేయడాన్ని నిరాకరించారు. అంతే కాకుండా అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో ట్రాఫిక్ పోలీస్ ఆయనను వెంబడించి నడిరోడ్డుపైనే దాడి చేశారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో సదరు పోలీసుపై చర్యలు తీసుకుంటామని రాంచీ సిటీ ఎస్పీ సౌరభ్తెలిపారు.