- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గణేశ్ శోభాయాత్ర.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
దిశ, వెబ్‌డెస్క్ :
హైదరాబాద్ మహానగనరం వినాయకుల నిమజ్జనానికి ముస్తాబవుతోంది. కరోనా నేపథ్యంలో ఈసారి తెలంగాణ వ్యాప్తంగా గణేశ్ పండుగ కళ తప్పింది. ప్రతిఏటా ఉన్నట్లు సందడి ఈసారి పెద్దగా కనిపించలేదు. ముఖ్యంగా ఖైరతాబాద్ గణేశ్ తన ఎత్తును భారీగా తగ్గించుకున్నాడు. ఎదైమేనా ప్రతిఏటా ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర దేశంలోనే చాలా గ్రాండ్‌గా, సందడిగా జరుగుతుంది. కానీ, ఈసారి సాదాసీదాగా జరగనున్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా, నగరంలో వివిధ రూపాల్లో కొలువైన గణనాథులు మరికొద్ది గంటల్లో గంగమ్మ ఒడికి చేరుకోనున్నారు. హైదరాబాద్‌లో అన్ని వైపుల నుంచి వినాయక విగ్రహాలు బాలాపూర్ గణేష్‌తో కలిసి మెయిన్ రోడ్ ద్వారా పయనించి హుస్సేన్ సాగర్‌కు చేరుకోనున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్ వద్ద 21 క్రేన్లను అధికారులు సిద్ధం చేశారు. ఇక ఖైరతాబాద్ గణపతి శోభాయాత్ర ఉదయం 10.30కు ప్రారంభమై, మధ్యాహ్నం 1.30 గంటలకు నిమజ్జనం పూర్తి చేస్తామని అధికారులు ప్రకటించారు.
దీంతో నగరంలోని పలుచోట్ల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవి మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకూ కొనసాగుతాయని చెప్పారు. ప్రధాన రూట్లల్లో ఇప్పటికే బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆయా ఏరియాల్లో రాకపోకలు సాగించేవారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ విభాగం ప్రకటించింది.
ముఖ్యంగా నెక్లెస్‌రోడ్, అప్పర్ ట్యాంక్‌బండ్‌లపై కేవలం గణనాథుడి నిమజ్జనానికి వచ్చే వాహనాలకు మాత్రమే అనుమతినివ్వనున్నారు. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేవారు.. వచ్చేవారు.. ఓ.ఆర్‌ఆర్ మీదుగా రాకపోకలు కొనసాగించాలని సూచించారు. ఇమ్లీబన్, జేబీఎస్‌లకు రాకపోకలు సాగించే జిల్లాల బస్సులు ఊరేగింపు లేని రూట్లల్లో ప్రయాణించాల్సి ఉంటుంది.