వారి కోసం ప్రత్యేకంగా ఈ-దుకాన్ యాప్

by Harish |
వారి కోసం ప్రత్యేకంగా ఈ-దుకాన్ యాప్
X

దిశ, వెబ్‌డెస్క్: అఖిల భారత వ్యాపారుల సమాఖ్య(సీఏఐటీ) తన రాబోయే ఈ-కామర్స్ పోర్టల్ ‘భారత్ ఈ-మార్కెట్’ కోసం మొబైల్ యాప్‌ను గురువారం విడుదల చేసింది. ఈ యాప్ వ్యాపార, సేవల అమ్మకందారులు నమోదు చేసుకునేందుకు సొంత ‘ఈ-దుకాన్’లకు అవకాశం ఇస్తుందని సీఏఐటీ తెలిపింది. సీఏఐటీ తమ పూర్తి భారతీయ ఈ-మార్కెట్ పోర్టల్ భారత నియమ నిబంధనలను అన్నిటికీ లోబడి ఉంటుందని పేర్కొంది. ఇటీవల విదేశీయ ఈ-కామర్స్ కంపెనీలు దేశీయ ఎఫ్‌డీఐ విధానాలను, నిబంధనలను ఉల్లంఘించాయని సీఏఐటీ ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలోని కొత్త ఈ-పోర్టల్‌ను తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. అయితే, సీఏఐటీ ఆరోపణలను విదేశీ ఈ-కామర్స్ కంపెనీలు ఖండించాయి. ‘విదేశీ ఈ-కామర్స్ కంపెనీలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ వ్యాపారులు, వినియోగదారులకు పూర్తిగా దేశీయ ఈ-కామర్స్ పోర్టల్ అవసరం ఉంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ పోర్టల్‌లో 7 లక్షల మంది వ్యాపారులను, 2023 డిసెంబర్ నాటికి కోటి మంది వ్యాపారులను భాగస్వామ్యం చేయాలని భావిస్తున్నట్టు’ సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed