- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా మృతదేహం.. డ్రైవర్‌గా మారిన డాక్టర్
దిశ, కరీంనగర్: ఆయన సాదా సీదా ఉద్యోగి కాదు, జిల్లా సర్వే లెన్స్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. పనులు చేయమని పురమాయిస్తే పని చేసేందుకు ఆయన వద్ద వ్యవస్థ కూడా ఉంటుంది. తప్పదు అనుకుంటే కలెక్టర్‌తో మాట్లాడి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయవచ్చు.. కానీ, వాటన్నింటిని పక్కన పెట్టేశారాయన. డ్యూటీ వరకే పరిమితం కావాలనుకోకుండా ట్రాక్టర్ డ్రైవర్‌గా అవతరాం ఎత్తారు.
పెద్దపల్లి జిల్లా సర్వే లెన్స్ అధికారి డాక్టర్ శ్రీరాం చేసిన సాహసం అందరికీ ఆదర్శంగా నిలిచింది. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఒకరు కరోనా పాజిటివ్‌తో చనిపోయారు. కొవిడ్ 19 ప్రోటోకాల్ ప్రకారం మృతదేహాన్ని ఖననం చేయాల్సి ఉంది. అయితే ట్రాక్టర్‌లో కరోనా బాధితుని శవాన్ని తరలిస్తున్న క్రమంలో డ్రైవర్ అందుబాటులో లేకుండా పోయాడు. శవాన్ని తరలించడం ఎలా అని ఆలోచిస్తున్న క్రమంలో జిల్లా సర్వేలెన్స్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డాక్టర్ శ్రీరాం పీపీఈ కిట్ వేసుకుని ట్రాక్టర్‌ను స్మశాన వాటిక వరకూ నడిపించారు. ఎవరూ ఊహించని విధంగా డాక్టర్ శ్రీరాం ట్రాక్టర్ నడిపించడం అందరినీ ఆశ్చర్య పరిచింది. డాక్టర్‌గా ఆయన చేసిన సాహసాన్ని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.
ఈ విషయంపై డాక్టర్ శ్రీరాం ‘దిశ’ ప్రతినిధితో మాట్లాడుతూ… డాక్టర్‌గా కరోనా విషయంలో ప్రజల్లో ఉన్న భయాన్ని పొగొట్టి బాధ్యతగా మెదలాల్సిన ఆవశ్యకతను వివరించాల్సిన బాధ్యత తనపై ఉందని, చిరుద్యోగుల్లో కరోనా విషయంలో భయం నెలకొనడం సాధరణమేనన్నారు. ఇలాంటి సమయంలో డాక్టర్‌గా నేను ప్రతి ఒక్కరిలో ఉన్న భయాన్ని పొగొట్టాల్సిన అవసరం ఉందని గ్రహించా.. అందుకే ట్రాక్టర్‌ను స్వయంగా నడిపానని వివరించారు. ప్రాణంతో ఉన్న కరోనా పేషంట్లను నిత్యం కలుస్తూ మాట్లాడుతున్న నేను చనిపోయిన వ్యక్తి విషయంలో భయపడడం కరెక్ట్ కాదనిపించందన్నారు.