- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ట్రాక్టర్ ఆటో ఢీ…ఒకరు మృతి
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్:
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనంతగిరి మండలం తమ్మర బ్రిడ్జి వద్ద ఆటోను ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. వివరాల్లో కెళితే… ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మనురాసిపల్లి గ్రామానికి చెందిన మేడ వెంకటేశ్వర్లు (48)అనే వ్యక్తి కూలి పనికి కోదాడ కు వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి ఆటోలో ప్రయాణమయ్యాడు. కోదాడ తమ్మర బ్రిడ్జి వద్ద ఆ ఆటోను ట్రాక్టర్ ఢీ కొట్టింది. దీంతో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకున్నారు. కేసు నమోదు చేసి మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Next Story