ట్రాక్టర్ కారు ఢీ.. ఒకరి మృతి

by Sumithra |
ట్రాక్టర్ కారు ఢీ.. ఒకరి మృతి
X

దిశ, మక్తల్ : ట్రాక్టర్ కారు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటన మక్తల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని టేకులపల్లి గ్రామ స్టేజి వద్ద సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ రమేష్ ( 22) మృతి చెందగా కారు డ్రైవర్ నారాయణరెడ్డి కి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో హుటాహుటిన నారాయణ రెడ్డిని మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మక్తల్ ఎస్సై ఎదిరింటి రాములు కథనం ప్రకారం… మక్తల్ మండలం గుర్లపల్లి గ్రామానికి చెందిన రమేష్ పుల్మామిడి గ్రామం నుండి ట్రాక్టర్ పై వస్తుండగా మక్తల్ నుండి బిజ్వార్ గ్రామానికి నారాయణరెడ్డి కారులో వస్తున్న నేపథ్యంలో టేకులపల్లి గ్రామ స్టేజీ వద్ద ఎదురెదురుగా వాహనాలు ఢీ కొన్నాయి. దీంతో రోడ్డు పక్కకు ట్రాక్టర్ బోల్తా కొట్టి ట్రాక్టర్ ఇంజన్ టైర్ కింద ట్రాక్టర్ డ్రైవర్ పడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మక్తల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని టైరు క్రింద శవాన్ని తొలగించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాములు తెలిపారు.

Advertisement

Next Story