రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా మన్యంకొండ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం… వ్యక్తి ట్రాక్టర్ పై దేవర కద్ర నుంచి మహబూబ్ నగర్ వెళుతున్నాడు. కాగా మహబూబ్ నగర్ మండలంలోని మన్యం కొండ సమీపానికి ట్రాక్టర్ చేరుకోగానే ప్రమాదవ శాత్తు ట్రాక్టర్ పై నుంచి పడి ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు గాజులపేట గ్రామానికి చెందిన కిషోర్ గౌడ్ గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Advertisement