- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రైవేట్ విద్యాసంస్థల సిబ్బందిని ఆదుకోవాలి: షేక్ షబ్బీర్ అలీ
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాలు ఇప్పించి వారికి న్యాయం చేయాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని టీపీటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ షబ్బీర్ అలీ కోరారు. శ్రీ నగర్ కాలనీలోని విద్యాశాఖ మంత్రి నివాసంలో టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బయ్యా శివరాజ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు అలీ బాషా, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు భాస్కర్ రాథోడ్ లతో కలిసి మంత్రికి వినతి పత్రం ఇచ్చారు. ఫిబ్రవరి 1 నుండి…9, ఆ పై తరగతులకు ప్రత్యక్ష బోధనా విధానానికి అనుమతులనిచ్చిన ప్రభుత్వం, ఆయా తరగతులకు బోధించే సిబ్బంది జీతాలపైన స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు.
అదే విధంగా నర్సరీ నుంచి 8 వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులను కూడా విధుల్లోకి తీసుకొని వారికి జీవో నెం 45 ప్రకారం జీతాలు ఇప్పించి ఆదుకోవాలనీ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 27 మంది ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారనీ తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రంలో మరిన్ని ఆత్మహత్యలు జరిగే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం కనీసం మానవత్వంతో వ్యవహరించడం లేదని వాపోయారు. కాగా ఈ నెల 19 న జరిగే విద్యాశాఖ అధికారుల సమావేశంలో అన్ని విషయాలు చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.