- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీతక్క తనకు కంకణం ఎందుకు కట్టిందో చెప్పిన రేవంత్..
దిశ, వెబ్‌డెస్క్ : బుధవారం టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. నన్ను ముందుకు నడిపేందుకు ములుగు సీతక్క ఎప్పుడూ ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు కూడా పెద్దమ్మ తల్లి, సమ్మక్క, సారక్క తల్లుల దీవెనెలతో సీతక్క నాకు కంకణం కట్టింది. ఫామ్ హౌసులో బంధీగా ఉన్న తెలంగాణ తల్లిని విడిపించాలని కోరిందని అన్నారు. ఇక విజయం మనదే అని.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కార్యకర్తలకు తెలిపారు.
అయితే, రేవంత్ రెడ్డి, ములుగు సీతక్కల మధ్య అనుబంధం కొన్నేళ్లుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. రేవంత్, సీతక్క టీడీపీలో ఉన్నప్పటి నుంచే వాళ్ల మధ్య అవినాభావ సంబంధం ఏర్పడింది. ఒకరి మీద ఒకరికి చాలా గౌరవ అభిప్రాయాలున్నాయి. ముందు నుంచి సీతక్క.. రేవంత్ రెడ్డికి సపోర్ట్ ఇస్తూనే వచ్చారు. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌ను అధిష్టానం ఫైనల్ చేసిన తర్వాత.. సీతక్క మేడారంలో పూజలు చేశారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ.. సీతక్క తర్వాతే తనకు ఏ పదవైనా అని కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.