- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నిజామాబాద్‌లో కవిత ఓటమికి కారణం వాళ్లే : రేవంత్ రెడ్డి

దిశ, బోధన్ : తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ విస్మరించిందని టీపీసీసీ రేవంత్ రెడ్డి అన్నారు. ఓటమి భయంతోనే తెలుగురాష్ట్రాల ప్రజలను సీఎం కేసీఆర్ రెచ్చగొడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఆదివారం కొంపల్లిలో జరిగిన బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల భేటీలో రేవంత్ మాట్లాడారు. ప్రజలను రెచ్చగొట్టి లబ్ధిపొందేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని విమర్శించారు.
నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామన్న హామీని తెరాస ప్రభుత్వం విస్మరించిందన్నారు. ‘‘ఇచ్చిన హామీలను మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత నిలబెట్టుకోలేకపోయారని.. అందువల్లే రైతులు నామినేషన్ వేసి మరీ కవితను ఓడించారని చెప్పారు. పసుపు బోర్డు తెస్తామని ఎంపీ అర్వింద్ మరోసారి ప్రజలను మోసగిస్తున్నారని తెలిపారు. త్వరలో గజ్వేల్, నిజామాబాద్‌లో భారీసభ ఏర్పాటు చేస్తాం’ అని రేవంత్ వెల్లడించారు.