ఆంధ్రా జలదోపిడిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలం 

by Shyam |
ఆంధ్రా జలదోపిడిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలం 
X

దిశ, మహబూబ్ నగర్ :
తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా ఆంధ్రా జలదోపిడిని అరికట్టడంలో అధికార పార్టీ నాయకులు విఫలమయ్యారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అభిప్రాయపడింది.ముఖ్యంగా పోతిరెడ్డిపాడు విషయంలో ఉమ్మడి ఏపీలో గళం వినిపించింది తామే అని చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్ ప్రస్తుతం జరుగుతున్న జల దోపిడిపై ఎందుకు మాట్లాడం లేదని ప్రశ్నించారు.ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన 203 జీఓ వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోతుందని చెప్పారు.బుధవారం మహబూబ్ నగర్ జిల్లాలో టీపీసీసీ ఆధ్వర్యంలో పోతిరెడ్డిపాడు పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేశారు.ఇందులో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, నాయకులు నాగం జనార్దన్ రెడ్డి, వంశీ చంద్ రెడ్డి, సంపత్, దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జూన్ 2న పెండింగ్ ప్రాజెక్టుల వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నీళ్ళ కోసం ప్రాజెక్టులు కట్టడం లేదని, మిషన్ భగీరథ, కొత్త ప్రాజెక్టులు అన్ని కూడా సీఎం కేసీఆర్ జేబులు నింపుకునేందుకు కడుతున్నారని ఆరోపించారు.జగన్ కృష్ణానదిలో పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలిస్తారని డిసెంబర్‌లో ప్రకటించారని, నాగం జనార్దన్ రెడ్డి సీఎం కేసీఆర్‌‌కు బహిరంగ లేఖ రాస్తూ కృష్ణా నీటి వినియోగంపై ఆలోచించాలని విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు. పోతిరెడ్డిపాడు నుంచి 88వేల క్యూసెక్కులు, సంగమేశ్వరం నుంచి 3టీఎంసీల నీరు ప్రతిరోజూ ఆంధ్ర ప్రదేశ్ తీసుకువెళితే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. జూన్2న మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ శ్రేణులు ప్రాజెక్టుల వద్ద ఒకరోజు దీక్ష చేపట్టాలిని ఉత్తమ్ పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed