- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫస్ట్ మీటింగ్.. టీపీసీసీ కొత్త టీమ్ కీలక నిర్ణయాలు
దిశ, తెలంగాణ బ్యూరో : గాంధీభవన్‌లో గురువారం కాంగ్రెస్ కీలక నేతలు సమావేశమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏఐసీసీ ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్‌తో కలిసి ఉదయం 10 గంటలకు టీపీసీసీ, సీఎల్పీ, కొత్త కమిటీల చైర్మన్లతో భేటీ అయ్యారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ముందుగా నిరుద్యోగ సమస్యలపై రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర చేయనున్నట్లు కమిటీ ముందు ప్రతిపాదన పెట్టినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
పీఆర్సీ నివేదిక, ఉద్యోగాల ఖాళీలు, నిరుద్యోగుల ఆందోళన వంటి అంశాలన్నీ ఈ సమావేశాల్లో చర్చించారు. దీనిపై ముందుగా కాంగ్రెస్నిరుద్యోగ ఎజెండాను తీసుకోవాలని భావిస్తున్నారు. నిరుద్యోగులు పార్టీకి అండగా ఉండే అవకాశం ఉంటుందని, రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర చేసే అంశంపై చర్చించారు. అయితే దీనిపై నేతలు అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మెజార్టీ నేతలు పాదయాత్రకు మద్దతు చెప్పినట్లు గాంధీభవన్ వర్గాల సమాచారం. ఈ నెల 10 నుంచి 19 తేదీ వరకు నిరుద్యోగ సమస్యలపై పాదయాత్రకు రెడీ అవుతున్నట్లు రేవంత్‌రెడ్డి ముందుగా నేతలకు వెల్లడించారు.
అయితే పార్లమెంట్ సమావేశాల తర్వాత పాదయాత్ర చేయాలని సూచించినట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. రేవంత్‌రెడ్డి పాదయాత్రపై పార్లమెంట్ సమావేశాల తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఠాగూర్చెప్పినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా విడతల వారీగా రేవంత్ పాదయాత్ర ఉండే అవకాశం ఉంది. అంతకు ముందు నిరుద్యోగ సమస్యపై మాత్రం పది రోజుల పాటు పాదయాత్ర చేసే అంశాన్ని రేవంత్‌రెడ్డి నేతలకు వివరించగా.. ఠాగూర్ నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అదే విధంగా దళితుల మీద దాడులు, పార్టీ ఫిరాయింపుల మీద పోరాడాలని సమావేశంలో నేతలు నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీకి సొంత మీడియా సంస్థల ఏర్పాటుపైనా పీసీసీలో చర్చించినట్లు తెలుస్తోంది.
మరోవైపు గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల సమావేశాలు కొనసాగుతున్నాయి. చాలా రోజుల తర్వాత గాంధీభవన్‌లో నేతల హడావుడి మొదలైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఠాగూర్, రేవంత్‌లు వరుస సమావేశాలు ప్లాన్ చేశారు. సాయంత్రం వరకు జిల్లా అధ్యక్షులుతో భేటీ కానున్నారు. సమావేశానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, వర్కింగ్ ప్రెసిడెంట్లు, కమిటీల చైర్మన్లు తదితరులు హాజరయ్యారు.
వైఎస్‌ఆర్‌కు నివాళి
దివంతగ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని గాంధీభవన్‌తో పాటుగా నగరంలోని పంజాగుట్ట సెంటర్ వద్ద వైఎస్ విగ్రహానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయనతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీభవన్‌లో ఠాగూర్‌తో పాటుగా కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు