కల్వకుంట్ల ప్రైవేట్ సైన్యంలా పోలీసుల తీరు

by Shyam |
కల్వకుంట్ల ప్రైవేట్ సైన్యంలా పోలీసుల తీరు
X

దిశ, మెదక్: పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా మారి అరెస్టులు చేయటం సిగ్గుచేటని టీ-పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఉత్తమ్ ఆధ్వర్యంలో గురువారం మంజీరా డ్యాం పరిశీలనకు కాంగ్రెస్ నాయకుల బృందం బయలుదేరింది. అయితే వారిని పటాన్ చెరువు టోల్ గేట్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. జలదీక్ష పేరుతో ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్తున్న తమను అడ్డుకోవడం దారుణమన్నారు. ప్రాజెక్టుల పరిశీలన తమ హక్కని.. ప్రభుత్వానికి పోలీసుల తొత్తులుగా మారొద్దని సూచించారు. గోదావరి నీటితో సింగూర్, మంజీరా డ్యాంను నింపుతామని చెప్పిన కేసీఆర్ మాట తప్పారన్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో చిన్నజీయర్ స్వామితో కలసి పదివేల మందితో సీఎం ప్రాజెక్ట్ ఎలా ప్రారంభిస్తారని ఉత్తమ్ ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబానికి ప్రత్యేక చట్టాలేమైనా ఉన్నాయా ? దీనిపై డీజీపీ సమాధానం చెప్పాలన్నారు. కల్వకుంట్ల ప్రైవేటు సైన్యంగా పోలీసులు వ్యవహరించొద్దన్నారు. ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు ప్రజల డబ్బును దోచుకుంటున్నారని .. 80 శాతం పూరైన ఎస్ఎల్‌బీసీని ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. గ్రావిటీ ద్వారా నీరొచ్చే ప్రాజెక్టులకు రూపాయి పని కూడా చేయటం లేదని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed