ఏపీ సర్కార్‌ను చూసి కేసీఆర్ నేర్చుకోవాలి

by Anukaran |   ( Updated:2020-08-26 08:46:13.0  )
ఏపీ సర్కార్‌ను చూసి కేసీఆర్ నేర్చుకోవాలి
X

దిశ, న్యూస్‌బ్యూరో: కేసీఆర్ సర్కార్‌ తీరుపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఫైరయ్యారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని, కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారని, కరోనా కట్టడి విషయంలో ఏపీ సర్కార్‌ను చూసి కేసీఆర్ నేర్చుకోవాలని హితవు పలికారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఉత్తమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనాపై 6నెలల క్రితం గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తే దూషించారని, కానీ కరోనా కట్టడిపై కేసీఆర్ సర్కార్ వైఫల్యం చెందిందని, గవర్నర్ స్వయంగా ఈ విషయాన్ని చెప్పారని గుర్తు చేశారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్దామంటే బిల్లులు భరించ లేని పరిస్థితులు ఉన్నాయని, రాష్ట్రంలో టెస్టుల సంఖ్యను పెంచకపోవడానికి కారణం ఏంటో సర్కార్ చెప్పాలన్నారు. 2014 ఎన్నికల్లో గిరిజనులకు హెలికాప్టర్ అంబులెన్స్ ఏర్పాటు చేస్తామని టీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిందని, కానీ అధికారంలోకి వచ్చాక 108 వ్యవస్థ పూర్తిగా వీక్ అయిపోయిందని ఆరోపించారు.

గాంధీభవన్‌లో సేవాదల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉత్తమ్… వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. డీసీసీ అధ్యక్షుల పనితీరు బాగుందని, కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. శ్రీశైలం ప్రమాదం ప్రభుత్వ వైఫల్యం వల్లే జరిగిందని ఆరోపించారు. కృష్ణా జలాల అంశంలో ప్రభుత్వ వైఖరి దాపరికంగా మారిందని, అపెక్స్ కౌన్సిల్‌కు హాజరుకాకుండా కేసీఆర్‌, ఏపీకి వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed