- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘అరచేతిలో స్వర్గం చూపించి ఆగం చేశారు’
దిశ ప్రతినిధి, వరంగల్ : వరంగల్ ప్రజలపై సీఎం కేసీఆర్ హామీలు గుప్పించి అరచేతిలో స్వర్గం చూపించాడని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి రాములునాయక్‌తో కలిసి గురువారం వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో ప్రచారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కేయూ విద్యార్థులు ముఖ్య పాత్ర పోషించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేయూ అధ్వానంగా తయారైందని వాపోయారు. వరంగల్ జిల్లాకు టెక్స్‌టైల్ పార్క్, రింగ్ రోడ్, జర్నలిస్ట్‌లకు ‘డబుల్’ తదితర హామీలిచ్చిన కేసీఆర్ అందులో ఒక్కటీ నిలబెట్టుకోలేదని విమర్శించారు. కమిషన్లు వస్తాయి కాబట్టే కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయపై కేసీఆర్, కేటీఆర్ దృష్టి సారించి అమలు చేశారని ఆరోపించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్ మాట్లాడుతూ ఆరేండ్లుగా పల్లా ఏం చేశాడనే విషయంపై కేయూలో చర్చ పెడదామన్నారు. అనంతరం వరంగల్ జిల్లా కోర్టులో న్యాయవాదులతో సమావేశమై ఓట్లు అభ్యర్థించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ హనుమంతరావు, వరంగల్ అర్బన్, రూరల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి, పీసీసీ సభ్యులు శ్రీనివాస్ రావు, బి.అశోక్ రెడ్డి, టీపీసీసీ కార్యదర్శులు సాంబయ్య, కొత్తపల్లి శ్రీనివాస్, మీసాల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.