- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దుబ్బాక దెబ్బకు కల్వకుంట్ల కుటుంబం దిగిరావాలి
దిశ, దుబ్బాక :
దుబ్బాక ఉప ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి చెరుకు శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద గుండవెళ్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారాన్ని ఆయన నిర్వహించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డితో కలిసి రోడ్ షో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ రెడ్డి మాట్లాడుతూ.. కల్వకుంట్ల మాటలు నమ్మి ఈ ప్రాంత ప్రజలు అనేకసార్లు మోసపోయారని అన్నారు. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి ని గెలిపించాలని కోరారు. దుబ్బాక దెబ్బకు కల్వకుంట్ల కుటుంబం దిగిరావాలని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…. చింతమడకలో చదువుకున్నానని చెప్పుకునే కేసీఆర్.. చింతమడక తరహాలో పెద్దగుండవెళ్లిలో పది లక్షలు ఎందుకు ఇవ్వడం లేదని విమర్శించారు. దుబ్బాకకు సిద్దిపేట నుంచి 40 సంవత్సరాలుగా దాయాదుల పోరు ఉందని అన్నారు. దుబ్బాకకు వచ్చిన అనేక నిధులను సిద్దిపేటకు తరలించి అభివృద్ధిని ఆపారని ఆయన ఆరోపించారు. సిగ్గు తప్పిన హరీశ్ రావు సిద్దిపేట నుండి వచ్చి ఏ మోహం పెట్టుకొని ఓట్లడుగుతున్నాడని ఆయన దుయ్యబట్టారు.