- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్‌లో ఇంటిదొంగలకు రేవంత్ రెడ్డి డెడ్‌లైన్
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీలోని ఇంటి దొంగలను వదిలే ప్రసక్తే లేదని టీపీసీసీ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెలాఖరు వరకు ఇంటిదొంగలకు డెడ్‌లైన్ ఇస్తున్నాని, మారకపోతే పరిస్థితి వేరే విధంగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. అలాగే ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ జెండాను కంటికిరెప్పాలా కాపాడుకుంటూ వచ్చిన కార్యకర్తలను కూడా వదులుకునేది లేదని స్పష్టం చేశారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో కార్యకర్తలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పెట్రోల్ ధరలు పెంచుతూ దేశంలో మోడీ.. రాష్ట్రంలో కేడీ పేద ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించారు. ఏడాదిలో 24 సార్లు పెట్రోల్ ధరలను పెంచి మోడీ – కేడీలు ప్రజలను దోచుకున్నారని ఎద్దేవా చేశారు. బర్మా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక దేశాల్లో రూ.50 లోపు లీటర్ పెట్రోల్ ధర ఉంటే.. భారత్‌లో మాత్రం మోడీ ప్రభుత్వం వంద రూపాయలు దాటించి పేదల కడుపు కొడుతున్నాడని అన్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో జీఎంఆర్ సంస్థతో కుమ్మక్కైన కేసీఆర్ అక్కడ ఇంధనానికి రూపాయి పన్ను వసూలు చేస్తున్నాడని తెలిపారు. అదే పేద ప్రజలపై లీటర్‌కు రూ.32 పన్ను బాదుతున్నాడని వెల్లడించారు. పెట్రోల్ పన్నుల రూపంలో ఏడేళ్లలో మోడీ 36 లక్షల కోట్లు.. కేసీఆర్ 12 లక్షల కోట్లు దోచుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఏ ఆశయం కోసం సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో అది నెరవేరలేదని, నాలుగు కోట్ల మంది బతుకులు బజారు పాలయ్యాయని, కేసీఆర్ చెప్పిన డబుల్ బెడ్రూం ఇల్లు, దళితులకు 3 ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, కేజీ టూ పీజీ విద్య, మైనార్టీ, గిరిజన రిజర్వేషన్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఏ హామీని నెరవేర్చలేదని అన్నారు. అదే కేసీఆర్ ఇంట్లో మాత్రం ఇంటిల్లిపాదికి ఉద్యోగాలు వచ్చాయని, రాసుకోవడానికి పేపరు, మాట్లాడడానికి ఛానల్, పండుకోవడానికి ప్రగతి భవన్ వచ్చిందని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ చేసిన దానికి వందరెట్ల పేరు.. వేల కోట్ల ఆస్తులు వచ్చాయని, కేసీఆర్ పైన ఇక జాలి పడాల్సిన అవసరం లేదని అన్నారు. ‘వాళ్లు చేసిన దానికి పక్కనున్న చెరువులో వేసి.. కాళ్లతో వాళ్ల తలపై తొక్కాల్సిన సమయం వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా అంటే రాంజీ గోండు కొమురం భీం చదువుల తల్లి సరస్వతి అని పేరు ఉండేది. కానీ.. ఇప్పుడు సోయి లేని సన్నాసి కేసీఆర్ వచ్చిన తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే జోకుడు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డి గుర్తుకు వస్తున్నారు. గుడిని గుడిలో లింగాన్ని గుడి ముందట చెప్పులను కూడా మాయం చేసే వాళ్ళు ఈ మంత్రులు. చెరువులను కబ్జా చేస్తూ.. డీ1 పట్టాలతో భూములను కాజేసి, కాంట్రాక్టర్ల కమిషన్లు దోచుకుంటున్నారు. ఇసుక దోపిడీ చేస్తున్నారు. ఇంటిని కట్టుకోవడానికి కంకర కావాలంటే.. ఇంద్రకరణ్ రెడ్డి ఇంటికి వెళ్లాల్సిన దుస్థితి. చెరువుల కబ్జాలను, బినామీల పేరిట భూములను కాజేసి వారిని వదిలేది లేదు. కాంగ్రెస్ పార్టీలోని ఇంటి దొంగలను కూడా వదిలిపెట్టేది లేదు. అలాగే కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలను వదులుకునేదీ లేదు.’’