బొగతలో పర్యాటకుల సందడి.. మరి కరోనా నిబంధనలు..!

by Anukaran |   ( Updated:2021-07-04 10:06:49.0  )
బొగతలో పర్యాటకుల సందడి.. మరి కరోనా నిబంధనలు..!
X

దిశ, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలం చికుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న బొగత జలపాతానికి పర్యాటకుల సందడి సంతరించుకుంది. సండే సెలవు దినం కావడంతో వివిధ శాఖల ఉద్యోగులు, వ్యాపారస్తులు తమ పిల్లాపాపలతో అత్యధికంగా తరలివచ్చారు. రాష్ట్ర నలుమూలల నుండి పర్యాటకులు తరలి రావడంతో బొగత జలపాతం ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది. బొగత అందాలను వీక్షిస్తూ ఆహ్లాదాన్ని పొందారు.

కరోనా ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో కరోనా నిబంధనలు పాటిస్తూ బొగత జలపాతం అందాలు వీక్షించాలని ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని నిబంధనలు ఉన్నప్పటికీ, ఏ ఒక్కరు కూడా నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తున్న నేపథ్యంలో కరోనా ప్రబలే అవకాశం ఎక్కువగా కనిపిస్తొంది. అధికారులు స్పందించి చర్యలు చేపట్టకపోతే పరిస్థితి చేజారాక తప్పదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వలన పర్యాటకులు నిబంధనలు పాటించడం లేదని కొంతమంది పర్యాటకులు వాపోతున్నారు.

Advertisement

Next Story