- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నామినేషన్ల దాఖలులో తడబడ్డ ఆ 27 మంది ఎవరో తెలుసా..!
X
దిశ, తెలంగాణ బ్యూరో : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధికారపార్టీతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ వేశారు. బుధవారం నామినేషన్ల పరిశీలనలో పలువురు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలు సరిగ్గా లేకపోవడంతో ఎన్నికల అధికారులు తిరస్కరించారు.
- ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు 10 మంది నామినేషన్లు వేయగా అందులో ఆరుగురి నామినేషన్ పత్రాలు సరిగ్గా లేకపోవడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ఉపసంహరించుకున్నారు. దీంతో మూడు నామినేషన్లు కాగా, ఇందులో రెండు టీఆర్ఎస్, ఒకరు ఇండిపెండెంట్.
- నల్లగొండలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి 11 నామినేషన్లకు 3 తిరస్కరణకు గురికాగా, 8 మంది పోటీలో ఉన్నారు. ఇందులో ఒకరు టీఆర్ఎస్, ఏడుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు.
- ఆదిలాబాద్‌లో ఒకస్థానానికి 24 మంది నామినేషన్ వేయగా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్ స్కృట్నీలో పోయింది. 23 మంది బరిలో ఉన్నారు. ఒకరు టీఆర్ఎస్ కాగా, మిగిలిన 22 మంది స్వతంత్ర అభ్యర్థులు.
- మెదక్ ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఐదుగురు నామినేషన్ వేయగా రెండు నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. ముగ్గురు బరిలో నిలిచారు. ఒకరు టీఆర్ఎస్, ఒకరు కాంగ్రెస్, మరొకరు ఇండిపెండెంట్.
- కరీంనగర్ రెండు స్థానాలకు 27 నామినేషన్లకు 3 తిరస్కరణకు గురికాగా, 24 మంది బరిలో ఉన్నారు. ఇద్దరు టీఆర్ఎస్ కాగా, 22 మంది స్వతంత్రులు.
- నిజామాబాద్ ఒక స్థానానికి ఇద్దరు నామినేషన్ వేశారు. ఇందులో ఇండిపెండెంట్ అభ్యర్థి శ్రీనివాస్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఒక్కరే ఉండటంతో ఏకగ్రీవం అయ్యారు.
- రంగారెడ్డి రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ముగ్గురు నామినేషన్ వేశారు. ఇందులో ఇద్దరు టీఆర్ఎస్ కు చెందిన శంభీపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డి కాగా ఇండిపెండెంట్ అభ్యర్థి చంద్రశేఖర్ నామినేషన్లు వేశారు. అయితే నామినేషన్ పత్రం ఎన్నికల నిబంధనల మేరకు లేకపోవడంతో అధికారులు తిరస్కరించారు.
- వరంగల్‌లో ఒక స్థానానికి 14 మంది నామినేషన్ వేయగా, 9 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. టీఆర్ఎస్ ఒకటి, నలుగురు స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ నెల 26న ఉపసంహరణ ఉండటంలో ఎవరు బరిలో ఉంటారో స్పష్టం కానుంది.
- ఖమ్మంలో ఒక స్థానానికి ముగ్గురు నామినేషన్లు వేశారు. వారివి ఎన్నికల నిబంధనల మేరకు ఉన్నాయి. పోటీలో ఉన్న వారిలో ఒకరు టీఆర్ఎస్, ఒకరు కాంగ్రెస్, మరొకరు ఇండిపెండెంట్ ఉన్నారు.
Advertisement
Next Story