కరోనా వారియర్లు జాగ్రత్తలు పాటించండి : IMA

by  |
కరోనా వారియర్లు జాగ్రత్తలు పాటించండి : IMA
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా కల్లోలం రోజురోజుకూ పెరుగుతుందే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో సాధారణ పౌరులతో పాటు కరోనా వారియర్లు సైతం వైరస్ బారిన పడి మృతిచెందుతున్నారు. ఇప్పటివరకు దేశంలో కరోనా మృతుల సంఖ్య 42 వేలకు పైగా చేరింది. అయితే, కరోనా రోగులకు వైద్యం అందించే డాక్టర్లు, నర్సులు కూడా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు.

కరోనా సోకి చికిత్స పొందుతూ 196 మంది వైద్యులు మరణించారని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (IMA)శనివారం ప్రకటించింది. డాక్టర్లు సైతం ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని, ఈ అంశంపై ప్రధాని మోడీ దృష్టి సారించాలని IMA కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.

దేశంలో ఏదోచోటా కరోనా బారిన పడుతున్న వైద్యుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రతిరోజూ కనీసం ఒక్క డాక్టర్ అండ్ సిబ్బంది చనిపోతున్నారు. ఇందులో అధికంగా జనరల్‌ వైద్యులు ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే వైద్యుల రక్షణ కోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీకి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ( IMA) లేఖ రాసింది. అన్ని విభాగాల్లో పనిచేసే డాక్టర్లతో పాటు వారి కుటుంబాలకు జీవిత బీమా కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొంది.


Next Story

Most Viewed