- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫోన్‌లో గేమ్స్ ఆడుతున్నారా.. ఇలా చేస్తే లక్షల్లో సంపాదన మీ సొంతం
దిశ, ఫీచర్స్ : ‘డిజిటల్ డివైజ్’ ఓ వ్యసనం కావచ్చు.. కానీ ఆ డివైజ్‌లను సరిగ్గా ఉపయోగించుకుంటే లక్షలు సంపాదించొచ్చని నేటి యువత నిరూపిస్తోంది. మొబైల్‌లో గేమ్ ఆడితే అమ్మనాన్నలు చివాట్లు పెడుతున్నారు. కానీ ఇప్పుడదే డబ్బులు సంపాదించే మార్గంగా మారింది. యూట్యూబ్‌లో గేమింగ్ అత్యంత ప్రజాదరణతో పాటు, లాభదాయకమైన జోనర్‌లలో ఒకటి కాగా, గేమింగ్ ఇండస్ట్రీ వ్యాప్తి చెందడం, ఇంటర్నెట్ వ్యాప్తి, డిజిటలైజేషన్, స్మార్ట్‌ఫోన్స్ అందరికీ చేరువ కావడంతో గేమింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనేది ఓ కెరీర్ ఆప్షన్‌గా నిలుస్తోంది. డబ్బు, పేరుతో పాటు కీర్తిని సంపాదించడానికి గేమర్స్ దీన్ని మించిన మరో ప్రొఫెషన్ ఆప్షన్ ఊహించుకోలేకపోతున్నారు. దాంతో మిలీనియల్స్, జెనరేషన్ జెడ్ యూత్ గేమింగ్ కంటెంట్ క్రియేటర్స్‌గా దూసుకుపోతూ సక్సెస్ సాధిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ అందుకుంటున్న ఈ ట్రెండ్‌ను ఇండియన్ యూట్యూబర్స్ కూడా ఒడిసిపట్టుకుని మిలియన్ల అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా, ఈస్పోర్ట్స్‌ను ప్రొఫెషనల్ కెరీర్‌గా ఎంచుకునేందుకు ప్రేరణగా నిలుస్తున్నారు.
డైనమో గేమింగ్ ..
ఆదిత్య సావంత్ ఓ గేమర్ కాగా అతని చానెల్ పేరు ‘డైనమో గేమింగ్’ ద్వారా బాగా ప్రసిద్ధి చెందాడు. ప్రముఖ పబ్‌జీ మొబైల్ ప్లేయర్‌గా తన యూట్యూబ్ వీడియోలను ప్రారంభించిన ఆదిత్య.. తక్కువ సమయంలోనే పబ్‌జీ గేమర్స్ దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం ‘బ్యాటిల్‌గ్రౌండ్ మొబైల్ ఇండియా’(బీజీఎమ్‌ఐ)కు సంబంధించిన వీడియోలు చేస్తున్నాడు. యూట్యూబ్‌లో 9.8 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో 2 మిలియన్ ఫాలోవర్లతో గేమింగ్ పరిశ్రమలో అత్యంత ప్రభావవంతమైన క్రియేటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. మే 18న లైవ్‌లో వచ్చిన అధికారిక బీజీఎమ్‌ఐ టీజర్‌లో కూడా ఆదిత్య కనిపించడం విశేషం. ఈ గేమ్ విడుదలైన తొలిరోజునే డైనమో గేమింగ్ యూట్యూబ్ చానెల్‌లో గేమ్‌ను ఆడి చూపించిన మొదటి స్ట్రీమర్‌గా నిలిచాడు. సాధారణంగా గేమ్‌లను రివ్యూ చేయడంతో పాటు, ప్రేక్షకులతో కమ్యూనికేట్ అవుతూ గేమ్ వివరాలు వెల్లడిస్తాడు. వీడియో గేమ్‌లలో లెవల్స్ క్లియర్ చేయడానికి ట్రిక్స్ అండ్ హ్యాక్స్ గురించి వివరిస్తాడు. పలు గేమింగ్ హ్యాక్స్‌లతో పాటు వివిధ అన్‌బాక్సింగ్ వీడియోలను కూడా చేస్తాడు.
జోనాథన్ గేమింగ్
ముంబైకి చెందిన19 ఏళ్ల ఈ-స్పోర్ట్స్ గేమర్, ఇన్‌ఫ్లుయెన్సర్ జోనాథన్ జ్యూడ్ అమర్‌లాల్ 2018నుంచి ఈ-స్పోర్ట్స్‌కు సంబంధించిన వీడియోలు చేస్తున్నాడు. పబ్‌జీ గేమింగ్ వీడియోలు చేస్తూ పాపులర్ అయిన జోనాథన్, అనేక ఈస్పోర్ట్స్ గ్లోబల్ చాంపియన్ టైటిల్స్ గెలుచుకున్నాడు. ‘జోనాథన్ గేమింగ్’ పేరుతో యూట్యూబ్ చానల్ నిర్వహిస్తుండగా, అందులో 2.79 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పటికే పలు బ్రాండ్‌లతో యాడ్ ఎండార్స్‌మెంట్ ఒప్పందాలు చేసుకున్నాడు.
క్యారీస్ లైవ్- అజేయ్ నగర్
క్యారీ మినాటి అకా అజేయ్ నగర్ గురించి నెటిజన్లకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అతను ఒక ప్రముఖ ఎంటర్‌టైనర్ కాగా క్యారీస్‌లైవ్ అనేది అజీ అధికారిక గేమింగ్ చానల్. అతను గొప్ప నైపుణ్యాలతో ఆడడమే కాకుండా తన వీక్షకులను కొన్ని డోప్ వ్యాఖ్యానాలతో అలరిస్తాడు. ఇండియాలో ‘రోస్టింగ్ కల్చర్’ను తీసుకొచ్చిన మొదటి యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లలో ఆయన ఒకడు. అతడి స్నేహితులు, ఆడియెన్స్, ఇతర ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో అజీ ఆడే గేమ్స్ వ్యూయర్స్‌కు సరదా పంచుతాయి. భారతదేశంలో అత్యుత్తమ గేమింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లలో ఒకరైన అజేయ్ వీడియో గేమ్స్ ట్రిక్స్, టిప్స్, హ్యాక్స్ గేమర్స్‌కు ఎంతో ఉపయోగపడతాయి.
మోర్టల్
పబ్‌జీ మొబైల్ గేమింగ్ గురించి నమన్ మాథుర్ తన మోర్టల్ చానెల్‌లో వివరిస్తాడు. అంతేకాదు నమన్ ప్రపంచంలోని అత్యుత్తమ పబ్‌జీ ప్లేయర్‌లలో ఒకరిగా నిలిచాడు. ఆటగాళ్లకు అత్యంత క్లిష్టమైన స్థాయిలను అధిగమించడానికి టిప్స్ అందిస్తూ వారిని ది బెస్ట్ ప్లేయర్స్‌గా మార్చడంలో సాయపడతాడు. మోర్టల్‌లో 5.83 మిలియన్లకు పైగా చందాదారులు ఉండగా క్రికెట్‌లో సిద్ధూ కామెంటరీ లాగా, ఆట ఆడుతున్నప్పుడు అతడి ఫన్నీ, వినోదాత్మక హిందీ కామెంటరీ కోసం ప్రేక్షకులు వేచి చూస్తారు. చానెల్‌లలో టెక్ గాడ్జెట్‌లు, బ్రాండ్‌లతో పాటు తాజా అప్‌డేట్‌లను కూడా నమన్ సమీక్షిస్తాడు.
భువనేశ్వర్ కుమార్
ఇండియన్ ప్లేయర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్ భువనేశ్వర్ క్రికెటర్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. అయితే భువి ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మరో ఇన్నింగ్స్ కూడా ఆడుతున్నాడు. అతను తనఇన్‌స్టా ప్రొఫైల్(@iambhuvi )లో 2.6 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగి ఉన్నాడు. క్రికెట్, ఫుట్‌బాల్ మొదలైన వివిధ క్రీడల గురించి మాట్లాడటానికి ఇష్టపడే భువి భారత క్రికెట్ జట్టుకు సంబంధించిన వివిధ చిత్రాలు, కార్యకలాపాలను పంచుకుంటూ ఉంటాడు.
అంకిత్ పంత్
అంకిత్ ప్రొఫెషనల్ గేమర్ కాగా, అనేక గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నాడు. తన పేరుతోనే యూట్యూబ్ వీడియోలు చేసే ఈ గేమర్ టీంబ్రుటాలిటీ వ్యవస్థాపకుడు కూడా. ఇది భారతదేశంలోని ఈ-స్పోర్ట్స్ సంస్థ కాగా గేమ్ ఔత్సాహికులను స్పాన్సర్ చేస్తుంది. ఇండియాలోనే కాదు, ఇతర దేశాల మ్యాగజైన్‌పై కనిపించాడు. రెడ్ బుల్, అథ్లెట్, ఇంటెల్, ఏలియన్‌వేర్ వంటి సంస్థలకు ప్రమోటర్‌గానూ వ్యవహరిస్తున్నాడు.
అన్‌మోల్ జైస్వాల్, లవ్ శర్మ , రోహన్ లెద్వానీ, చేతన్ సంజయ్, హర్నిత్ కత్రి, రిషబ్ కర్నవాల్, రిషబ్ వర్మ, చేతన్ చాంద్‌గుడే, గ్యాన్ సుజన్, రోనక్ మకోడియా, శుభం సైనీ, రోనీ దాస్‌గుప్తాలతో పాటు వేలాది ఇతర టెక్నికల్ గేమింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు వివిధ న్యూ-ఏజ్ గేమ్‌లను రివ్యూ చేయడానికి ప్రసిద్ధి పొందారు. మీరు ఆన్‌లైన్ గేమ్ లేదా ఇతర అప్లికేషన్‌ను ప్రారంభించాలనుకుంటే మీ చానెల్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో మీ ప్రొడక్ట్‌ను ప్రమోట్ చేయగల ఇన్‌ఫ్లుయెన్సర్ లేదా బ్లాగర్‌ను మీరు సంప్రదించవచ్చు. మీ టార్గెట్ ఆడియెన్స్‌ను సులభంగా చేరువ కావడానికి ఇది మీకు సహాయపడుతుంది. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కు మిలియన్ల మంది ఫాలోవర్స్ మద్దతు ఇస్తుండగా మీ గేమింగ్ అప్లికేషన్‌ను వారితో ప్రమోట్ చేయిస్తే త్వరగా ఆడియెన్స్‌కు రీచ్ అవుతుంది.
ఆర్జన ఎంత?
ఈ గేమింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఇప్పటికే పెద్ద పెద్ద బ్రాండ్స్‌తో టైఅప్ కాగా, మరెన్నో గేమింగ్ కంపెనీలకు ప్రమోటర్స్‌గానూ వ్యవహరిస్తున్నారు. యూట్యూబ్, ఇన్‌స్టా ప్లాట్‌ఫామ్స్ నుంచి తమ వీడియోలతో లక్షల్లో ఆదాయం సంపాదిస్తూ గేమింగ్ ఓ ప్రొఫెషన్‌గా చేపట్టవచ్చని నేటి యువతకు ఓ మార్గాన్ని సుగమం చేశారు. ఇక బ్రాండ్‌ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రచార వీడియోలు, వ్లాగ్, బ్లాగ్స్ చేస్తూ ఉత్తమంగా సంపాదిస్తున్నారు.