- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
IMDbలో టాప్10 ఇండియన్ సిరీస్ & షోస్.. వాటికి తగ్గని క్రేజ్
దిశ, సినిమా : కొవిడ్ -19 డిజిటల్ వరల్డ్‌ను మరింత స్ట్రాంగ్‌గా చేసింది. సినిమాలు థియేటర్స్‌లో రిలీజ్ అవుతున్నాయా? లేక ఓటీటీలో మెప్పిస్తున్నాయా? అనేది పక్కన పెడితే వెబ్ సిరీస్‌లు మాత్రం సూపర్ కంటెంట్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. కామెడీ, ఎమోషనల్, థ్రిల్లర్, సస్పెన్స్, బోల్డ్ ఇలా ఏ జోనర్ కోరుకునే వారు అయినా సరే సిరీస్‌ల కంటెంట్‌తో ఫుల్‌గా శాటిస్‌ఫై అవుతున్నారు.
ఈ క్రమంలో డిజిటల్ కంటెంట్ ఎక్కువగా పెరిగిపోవడం.. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఒకే రోజు నంబర్ ఆఫ్ సిరీస్‌లు, సినిమాలు రిలీజ్ అవుతుండటంతో.. ఏది చూడాలో సెలెక్ట్ చేసుకోలేక పోతున్నారు ఆడియన్స్. అందుకే IMDb ర్యాంకింగ్ ఆధారంగా టాప్ 10 ఇండియన్ వెబ్ సిరీస్, టీవీ షోస్ వివరాలతో మీ ముందుకు వచ్చింది ‘దిశ’ సినిమా. యూజర్ రేటింగ్స్ ఆధారంగా IMDb టాప్ 250 ర్యాంకింగ్స్ నుంచి సెలెక్ట్ చేసిన షోస్ డిటెయిల్స్ మీకోసం.
1. స్కామ్ 1992 – Sony LIV
హన్సల్ మెహతా డైరెక్షన్‌లో వచ్చిన ‘స్కామ్ 1992’ 2020లో రిలీజ్ అయిన బెస్ట్ సిరీస్ అనిపించుకుంది. ప్రతీక్ గాంధీ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా IMDb బెస్ట్ టీవీ షోస్/ సిరీస్‌లో ర్యాంక్ సంపాదించింది. ఇండియన్ సిరీస్‌లో టాప్ మోస్ట్ ర్యాంక్‌లో కొనసాగుతున్న ఈ సిరీస్‌ను స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా లైఫ్ బేస్ చేసుకుని తెరకెక్కించారు. టైట్ స్టోరీ, అమేజింగ్ పర్ఫార్మెన్సెస్, స్టాక్ మార్కెట్ పరిభాషను సమర్థవంతంగా వివరించడంలో సక్సెస్ అయిన ‘స్కామ్ 1992’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
2. ఆస్పిరెంట్స్ – Youtube
2021లో యూట్యూబ్‌లో విడుదలైన ఈ టీవీఎఫ్ షో లార్జ్ ఫాలోయింగ్ సంపాదించింది. ఐదు ఎపిసోడ్స్‌తో కూడిన ఈ సిరీస్‌లో నవీన్ కస్తూరియా, సన్నీ హిందూజా లీడ్ రోల్స్‌లో కనిపించగా.. ప్రపంచవ్యాప్తంగా కష్టతరమైన ప్రవేశ పరీక్షలలో ఒకటైన UPSC పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల స్ట్రగుల్స్ గురించి వివరించింది. యూట్యూబ్‌లో వీక్లీ ప్యాటర్న్ బేస్డ్ రిలీజ్ అయిన ఈ సిరీస్ వ్యూయర్స్ OTT ప్లాట్‌ఫామ్ సబ్‌స్క్రిప్షన్ పొందాల్సిన అవసరం లేనందున భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.
3. పిచర్స్ – Sony LIV
2015లో విడుదలైన ‘పిచర్స్’ ఏడు సంవత్సరాలుగా ఫేవరేట్ షోస్‌లో ఒకటిగా కొనసాగుతోంది. ఇండియన్ డిజిటల్ కంటెంట్ రెవల్యూషన్‌కు కారణమైన ఈ షో.. నలుగురు ఎంటర్‌ప్రెన్యూయర్స్ స్టార్ట్ అప్ కోసం ప్రయత్నించే సమయంలో ఎదురయ్యే పరిణామాల చుట్టూ తిరుగుతుంది. యూట్యూబ్‌లో రికార్డులుల సృష్టించిన ‘పిచర్స్’ ప్రస్తుతం సోని లైవ్, టీవీఎఫ్ ప్లేలో అందుబాటులో ఉంది.
4. కోటా ఫ్యాక్టరీ -Youtube
మరో టీవీఎఫ్ సిరీస్ ‘కోటా ఫ్యాక్టరీ’ 2019లో యూట్యూబ్‌లో స్ట్రీమ్ అయింది. రాజస్థాన్‌లోని కోటా నగరంలో ప్రబలంగా ఉన్న కోచింగ్ కల్చర్‌ను బేస్ చేసుకుని తెరకెక్కిన ఈ సిరీస్.. రిలెటబుల్ క్యారెక్టర్స్, అమేజింగ్ అండ్ కామ్ విజువల్స్‌తో ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేసింది. జితేంద్ర కుమార్, మయూర్ మోర్ నటించిన ఐదు ఎపిసోడ్స్‌తో కూడిన సిరీస్ యూట్యూబ్‌లో 130 మిలియన్లకు పైగా వ్యూస్ పొందడం విశేషం.
5. గుల్లక్ – Sony LIV
భారతీయ మధ్యతరగతి కుటుంబం కథను వివరించే ‘గుల్లక్’ సోనీ లైవ్‌లో ప్రసారం కాగా.. ప్రజలు రోజువారీ సమస్యలతో ఎలా పోరాటం చేస్తున్నారో వివరిస్తుంది. క్యారెక్టర్ అండర్‌స్టాండింగ్, స్టోరీ పొట్రేట్ చేసిన విధానానికి ఫస్ట్ సీజన్ ప్రశంసలు అందుకోగా.. సెకండ్ సీజన్ కూడా తీసుకొచ్చారు మేకర్స్. 2021లో విడుదలైన దీనికి ఓ రేంజ్‌లో కాంప్లిమెంట్స్ వచ్చాయి.
6. రామాయణ్ – దూరదర్శన్
దూరదర్శన్‌లో తొలిసారి 1987లో ప్రసారమైన ‘రామాయణ్’.. ప్రేక్షకుల అభ్యర్థన మేరకు 2020 లాక్డౌన్‌లో పున:ప్రసారం చేశారు. ఈ క్రమంలో అంచనాలకు మించి IMDb రేటింగ్‌లో టాప్ ప్లేస్‌లోకి దూసుకుపోయింది. రామానంద్ సాగర్ దర్శకత్వంలో వచ్చిన ‘రామాయణ్’.. టెలివిజన్‌లో ప్రసారమైన పౌరాణిక కథలకు బెంచ్ మార్క్‌గా మిగిలిపోయింది. ఈ సీరియల్‌లో ప్రధానపాత్రల్లో కనిపించిన నటీనటులు 34 ఏళ్లుగా ప్రేక్షకులచే ఆరాధించబడుతున్నారంటే అతిశయోక్తికాదు.
7. మహాభారత్ – దూరదర్శన్
మరో పౌరాణిక గాథ ‘మహాభారత్’కు సైతం రికార్డు స్థాయిలో వీక్షకులతో హై IMDb రేటింగ్‌తో మంచి ర్యాంక్ సంపాదించింది. బీఆర్ చోప్రా డైరెక్షన్‌లో వచ్చిన ఈ షో.. ఎపిక్ స్టోరీస్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ సీరియల్ కాగా టెలివిజన్‌లో ఎన్నిసార్లు ప్రసారమైనా సరే తరగని ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంటుంది. 2020 లాక్డౌన్‌లో మరోసారి దూరదర్శన్‌లో స్ట్రీమింగ్ అయిన ఈ షో ఎప్పటిలాగే ఆడియన్స్‌ను టీవీల ముందు కూర్చోబెట్టింది.
8. సారాభాయ్ వర్సెస్ సారాభాయ్ – డిస్నీ + హాట్‌స్టార్
ఈ కామెడీ షో తొలుత 2000 సంవత్సరంలో టీవీలో ప్రసారమైంది. అయితే ఇది రన్ అవే హిట్ కానప్పటికీ తర్వాతి రోజుల్లో మాత్రం క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. అప్‌డేటెడ్ క్యారెక్టర్స్‌తో స్ట్రీమ్ అయిన ఈ సీరియల్ ఇండియన్ టెలివిజన్ కామెడీలో బెంచ్‌మార్క్ సెట్ చేసింది. సూపర్ డూపర్ రెస్పాన్స్‌తో దూసుకుపోయిన ఈ సీరియల్‌కు సీక్వెల్‌గా హాట్‌స్టార్ సెకండ్ సీజన్‌ను తీసుకురాగా.. అంతగా ఆకట్టుకోలేకపోయింది.
9. యేహ్ మేరీ ఫ్యామిలీ -టీవీఎఫ్ ప్లే
1990వ దశకంలో సెట్ చేయబడిన ‘యేహ్ మేరీ ఫ్యామిలీ’ స్టోరీ మధ్యతరగతి కుటుంబం గురించి వివరిస్తుంది. తల్లిదండ్రులు, ముగ్గురు పిల్లల సమ్మర్ వెకేషన్ గురించి కథ సాగుతుండగా.. 12 ఏళ్ల చిన్నారి కోణం నుంచి స్టోరీ న్యరేట్ చేయబడుతుంది. మోనా సింగ్, ఆకర్ష్ ఖురానా నటించిన ఈ షో 2018లో యూట్యూబ్, టివిఎఫ్ ప్లేలో ప్రసారం కాగా సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ పొందింది. సెకండ్ సీజన్ గురించి చర్చలు జరుగుతుండగా.. మేకర్స్ నుంచి ఇంకా అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ప్రస్తుతం టీవీఎఫ్ ప్లేలో అందుబాటులో ఉన్న ఈ సిరీస్‌ను ఎంజాయ్ చేయొచ్చు.
10. పంచాయత్ – అమెజాన్ ప్రైమ్
జితేంద్ర కుమార్ లీడ్ రోల్ ప్లే చేసిన ‘పంచాయత్’ సిరీస్‌కు ప్రభుత్వ ఉద్యోగులు ఇట్టే కనెక్ట్ అయిపోయారు. గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వ్యక్తికి మనశాంతి లభించనప్పుడు ఏం చేస్తాడు? ఆ ఉద్యోగంలో శాటిస్‌ఫాక్షన్ లేనప్పుడు మెంటల్‌గా ఏర్పడే సమస్యలు, ఎదుర్కోనే పరిణామాల గురించి ఈ సిరీస్‌లో చూపించారు మేకర్స్. నీనా గుప్తా, రఘుబీర్ యాదవ్ కీలకపాత్రల్లో కనిపించిన ఈ సిరీస్ 2020లో విడుదలై బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకుంది.