‘ఆటో పరిశ్రమలో సంస్కరణలు అవసరం’

by  |
‘ఆటో పరిశ్రమలో సంస్కరణలు అవసరం’
X

దిశ, వెబ్‌డెస్క్: ఆటో పరిశ్రమ (Auto industry)లో ప్రాథమిక సంస్కరణలు అవసరమని ఫోర్స్ మోటార్స్ అభిప్రాయపడింది. అధిక పన్నులు, అధిక వడ్డీ రేట్ల ( higher taxes, higher interest rates) కారణంగా దేశీయంగా ఆటో పరిశ్రమ వృద్ధి, లాభదాయకత రెండూ అతిపెద్ద అవరోధాలను ఎదుర్కొంటోందని ఫోర్స్ మోటార్స్ (Force Motors) వెల్లడించింది. భారత ఆటోమోటివ్ పరిశ్రమ వృద్ధి చెందుతున్నప్పటికీ మార్కెట్ వృద్ధికి పెట్టుబడుల ప్రోత్సాహం, పరిశ్రమ లాభదాయకత అంశాల్లో తీవ్రమైన అడ్డంకులున్నాయని 2019-20 వార్షిక నివేదికలో ఫోర్స్ మోటార్స్ పేర్కొంది.

ఈ సమస్యలు బహుళజాతి సంస్థ (Multinational company)లే కాకుండా దేశీయ కంపెనీలను కూడా ప్రభావితం చేస్తాయని నివేదిక తెలిపింది. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్‌ (International Market)తో పోలిస్తే చాలా ఎక్కువ వడ్డీ వ్యయం ఉండటం. ముఖ్యంగా సాంకేతికత వేగంగా మారుతున్న సమయంలో పెట్టుబడులను ఇది దెబ్బతీస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో సాంకేతికత, ఉత్పత్తులు, వ్యాపార పద్దతుల్లో కొత్త పెట్టుబడులు ఎక్కువగా వస్తాయనే విషయాన్ని గుర్తించాలని ఫోర్స్ మోటార్స్ పేర్కొంది.

అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే వడ్డీ రేట్ల వ్యత్యాసం 6-8 శాతం పరిధిలో ఉంది. ఇది పరిశ్రమలో పోటీతత్వాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని వెల్లడించింది. మరో సమస్య.. ఎక్కువ జీఎస్టీ (GST), దాంతో పాటు దేశంలో ఆటోమొబైల్స్‌ (Automobiles)పై విధించిన అధిక రహదారి పన్నులు. ప్రస్తుత ఏడాది మొదటిభాగంలో సంభవించిన కరోనా ప్రభావం చాలా సంవత్సరాలు వెంటాడుతుంది. ఆటో పరిశ్రమ కొవిడ్-19 ముందు నాటి స్థాయికి చేరాలంటే ప్రాథమిక సంస్కరణలు కీలకమని ఫోర్స్ మోటార్స్ నివేదికలో వెల్లడించింది.

Read also…

‘కరోనా నుంచి బయటపడ్డాం’



Next Story

Most Viewed