ఏపీ సీఎంతో అపాయింట్‌మెంట్.. బాలయ్య వచ్చేనా ?

by Shyam |
ఏపీ సీఎంతో అపాయింట్‌మెంట్.. బాలయ్య వచ్చేనా ?
X

కరోనా ఎఫెక్ట్‌తో సినిమా ఇండస్ట్రీ చిన్నబోయింది. లాక్‌డౌన్ కారణంగా సినిమాల విడుదల వాయిదా పడగా.. షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. కాగా ఇటీవలే లాక్‌డౌన్‌కు సడలింపులివ్వడంతో తిరిగి షూటింగ్స్‌కు అనుమతి కోరుతూ ఇండస్ట్రీ పెద్దలు ఈ మధ్యే తెలంగాణ సీఎం కేసీఆర్‌తో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఇవి సఫలీకృతం కాగా.. జూన్ 9న ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలవబోతున్నట్లు నిర్మాత సి. కళ్యాణ్ తెలిపారు. ఈ మీటింగ్‌కు బాలకృష్ణను కూడా పిలిచినట్లు ఆయన చెప్పారు. మూవీ మొఘల్ నిర్మాత డి. రామానాయుడు జయంతి వేడుకల్లో పాల్గొన్న కళ్యాణ్.. ఈ విషయాన్ని వెల్లడించారు.

జూన్ 9న మ. 3 గంటలకు జగన్ అపాయింట్‌మెంట్ ఉందన్న ఆయన.. ఈ మీటింగ్‌కు బాలకృష్ణను పిలిచినా, జూన్ 10న తన పుట్టినరోజు ఉన్నందున తను రాలేకపోవచ్చన్నారు. చిరంజీవితో పాటు మరికొందరు సినీ పెద్దలతో కలిసి సీఎంను కలుస్తామన్నారు. కాగా కేసీఆర్‌తో ఇండస్ట్రీ జరిపిన చర్చలకు బాలయ్యను పిలవకపోవడంతో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed