- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆహ్లాదకరం.. ఉమామహేశ్వర ఉగ్రరూపం
దిశ, వెబ్‌డెస్క్: ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ సత్యదేవ్ నుంచి వస్తున్న మరో విభిన్న చిత్రం. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమో వీడియో ఆకట్టుకోగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని టీజర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. అరకు లోయలో ఒక ఫొటోగ్రాఫర్ లవ్ స్టోరీని ఓ అందమైన కావ్యంగా తెరకెక్కిస్తున్నట్లు టీజర్ ద్వారా అర్థమవుతోంది. కానీ, చేయని తప్పునకు మరొకరి చేతిలో చావు దెబ్బలు తిన్న ఉమామహేశ్వర్‌రావు ఉగ్రరూపం ఎలా ఉంటుందో రుచి చూపించడమే కథ. కేరాఫ్ కంచెర పాలెం సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకులు వెంకటేష్ మహా.. ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాహుబలి నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా కేరాఫ్ కంచెర పాలెం నిర్మాత విజయ ప్రవీణ పరుచూరితో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం మలయాళి సినిమా ‘మహేషింతే ప్రతీకారం’ రీమేక్‌గా వస్తోంది.
‘ఉమా మహేశ్వర ఉగ్రరూసస్య’ టీజర్.. ఉమా మహేశ్వర్‌రావును పిలవడంతో ప్రారంభం అవుతుంది. తర్వాత అతను ఫొటో తీసే విధానాన్ని చూపించగా ఫొటో క్లిక్ చేస్తున్నప్పుడు అమ్మాయిని చూసి పడిపోయిన ఫొటోగ్రాఫర్ లవ్ స్టోరీని పరిచయం చేశాడు. సీన్ కట్ చేస్తే ఉమా మహేశ్వర్‌రావుకు కోపం వచ్చింది? ఎందుకు వచ్చింది? ఏమైంది? అనే విషయాన్ని తెరపై ఓ కావ్యంగా చూపించబోతున్నారు డైరెక్టర్ వెంకటేష్ మహా. నేషనల్ అవార్డు విన్నర్ బిజిబల్ సినిమాకు సంగీతం అందిస్తుండగా టీజర్‌లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందని ఇప్పటికే ప్రశంసలు వస్తున్నాయి.
ఉమామహేశ్వర ఉగ్రరూపస్య టీజర్‌పై ట్వీట్ చేశారు డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. టీజర్ చాలా ఆహ్లాదకరంగా ఉందని కాంప్లిమెంట్ ఇచ్చారు. దర్శకులు పూరీ జగన్నాథ్ సైతం సత్యదేవ్ యాక్టింగ్ స్కిల్స్‌ను ప్రశంసించారు. అడవి శేషుతోపాటు సినీ ప్రముఖులు ప్రశంసలు అందిస్తూ మూవీ యూనిట్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. ఏప్రిల్ 17న సినిమా విడుదల కానుంది.