టోల్ బూత్‌లను ఎత్తివేస్తాం.. కేంద్రం కీలక ప్రకటన

by Shamantha N |
టోల్ బూత్‌లను ఎత్తివేస్తాం.. కేంద్రం కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్ : టోల్ ప్లాజాల విషయంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఏడాదిలోపు టోల్ బూత్‌లను తొలగిస్తామని, పూర్తి జీపీఎస్ ఆధారిత టోల్ వసూళ్లను అమలు చేయనున్నట్లు రోడ్డు రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్‌లో తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ప్రస్తుతం 93 శాతం వాహనాలు ఫాస్ట్‌ ట్యాగ్ ఉపయోగించి టోల్ చెల్లిస్తున్నాయని, అయితే మిగిలిన 7 శాతం మంది డబుల్ టోల్ చెల్లిస్తున్నారని తెలిపారు. దేశంలోని అన్ని టోల్ బూత్‌లు తొలగిపోతాయి.. వాటి స్థానంలో జీపీఎస్ ద్వారా టోల్ వసూలు జరుగుతుంది. వాహనాలపై (జీపీఎస్ ఇమేజింగ్ ) ఆధారంగా డబ్బు వసూలు చేయబడుతుందని గడ్కరీ చెప్పారు.

టోల్ ప్లాజాలలో ఎలక్ట్రానిక్ ఫీజు చెల్లింపును సులభతరం చేసే ఫాస్ట్ ట్యాగ్స్ ను 2016 లో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి 16 నుండి తప్పనిసరి చేశారు. ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాలు దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ టోల్ ప్లాజాలలో డబుల్ టోల్ ఫీజు చెల్లించాలి. ట్యాగ్‌లను తప్పనిసరి చేయడం టోల్ ప్లాజాల ద్వారా వాహనాలు సజావుగా ప్రయాణించేలా చూడడంలో సహాయపడతాయి, ఎందుకంటే ఫీజు చెల్లింపు ఎలక్ట్రానిక్‌గా జరుగుతుంది. కొత్త వాహనాల్లో ఫాస్‌ట్యాగ్‌లు అమర్చినట్లు గడ్కరీ చెప్పారు.

Advertisement

Next Story