- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఒలంపిక్స్‌లో విదేశీ ప్రేక్షకులకు నో ఎంట్రీ
దిశ, స్పోర్ట్స్ : కరోనా మహమ్మారి కారణంగా ఏడాది పాటు వాయిదా పడిన టోక్యో ఒలంపిక్స్ జులై 23 నుంచి నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభం అయినా.. రెండో వేవ్ తిరిగి ప్రారంభం కావడంతో కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జపాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.
ఒలంపిక్స్‌కు 50 శాతం మంది స్థానిక ప్రేక్షకులను మాత్రమే అనుమతించాలని, విదేశీ పర్యటకులకు ఒలంపిక్స్ కోసం వీసాలు జారీ చేయకూడదని నిర్ణయించినట్లు క్యూదో న్యూస్ ఏజెన్సీ మంగళవారం వెల్లడించింది. జపాన్ ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం క్యూదో న్యూస్‌కు చెప్పింది. జపాన్ ప్రభుత్వం, నిర్వాహక కమిటీ ఇటీవల అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీతో కలిసి ఒక వర్చువల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో ప్రేక్షకుల అనుమతిపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా, టోక్యోలో జులై 23 నుంచి అగస్టు 8 వరకు వేసవి ఒలంపిక్స్, అగస్టు 24 నుంచి సెప్టెంబర్ 5 వరకు పారా ఒలంపిక్స్ నిర్వహించనున్నారు.